Devara first single: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమాకి పాన్ ఇండియాలో మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటికే దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్ కి ఈ సినిమా మరొక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందిస్తుందని ఎన్టీయార్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాని సక్సెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కొరటాల శివ అసలు ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచేసింది. కాబట్టి ఇప్పుడు మే 19వ తేదీన ఫస్ట్ సింగిల్ గా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టుగా సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సాంగ్ జైలర్ సినిమాలో వచ్చిన ‘హుకుం ‘ అనే సాంగ్ ను మించి ఉండబోతుందనే వార్తలైతే ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరి ఈ ఈ సాంగ్ జైలర్ సాంగ్ ను మించి ఉంటుందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సాంగ్ రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్ ని కూడా కొరటాల శివ చాలా కసితో తెరకెక్కిస్తున్నాడట. ఇక వాటర్ లో జరిగే ఒక ఫైట్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి హైలైట్ కాబోతుందని సినిమా యూనిట్ నుంచి ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది.
ఇక ఆ ఫైట్ తర్వాత గ్లింప్స్ లో రిలీజ్ చేసిన ఫైట్ ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ గా మారిబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే కొరటాల శివ ఈ సినిమాతో భారీగానే ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించి ఎన్టీఆర్ ని స్టార్ హీరోగా నిలబెడతాడు అనేది…