Coolie Movie Collections: తమిళ్ సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రజినీకాంత్ (Rajinikanth)…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని తారాస్థాయిలో నిలిపాయి. 74 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ మంచి సినిమాలు చేయడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు అంటే నిజంగా ఆయనకు సినిమా అంటే ఎంత పిచ్చో మనం అర్థం చేసుకోవచ్చు… లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఆయన చేసిన కూలీ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు 1000 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొడుతోంది అంటూ చాలా వరకు కామెంట్లు అయితే చేశారు. కానీ వాటన్నింటికి ఈ సినిమా సమాధానం చెప్పలేకపోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా మొదటి షో తోనే డివైడ్ టాక్ ను తెచ్చుకోవడంతో చాలామంది ఈ సినిమాని చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. మరి ఈ సినిమాల లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది. అనే విషయం తెలీదు కానీ మొత్తానికైతే లోకేష్ కనకరాజు నుంచి ఇలాంటి ఒక సినిమా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు… ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు చేసిన ఆయన ఇలాంటి ఒక అర్థంపర్థం లేని కథని తీసుకొని ఇందులో రజినీకాంత్ ని హీరోగా పెట్టి సినిమా చేస్తారని మాత్రం ఎవరు ఊహించలేదు. ఈ సినిమాని చూసిన తర్వాత రజనీకాంత్ అభిమానులు సైతం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక లోకేష్ కనకరాజు మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశాడు అంటూ లోకేష్ కనకరాజు ను సైతం వాళ్లు తీవ్రంగా విమర్శిస్తూ ఉండడం విశేషం…
రజనీకాంత్ ఈ సినిమాతో తన మార్కెట్ ను భారీగా కోల్పోయే అవకాశాలైతే ఉన్నాయి. మరి తర్వాత రాబోతున్న ‘జైలర్ 2’ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా పాన్ ఇండియాలో తన మార్కెట్ మరోసారి పదిలంగా కాపాడుకుంటాడా? లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
ఎప్పుడైతే రజనీకాంత్ ఈ సినిమాను చేస్తున్నానని అనౌన్స్ చేశాడో అప్పటినుంచి సినిమా మీద విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో సైతం మొదటి రోజు ఈ సినిమా కి హౌస్ ఫుల్ గా టికెట్స్ బుక్ అవ్వడం అనేది నిజంగా ఈ సినిమా మీద ఉన్న హైప్ ను తెలియజేస్తోంది…
ఇక మొదటి రోజు ఈ మూవీ కి డివైడ్ టాక్ రావడంతో ఈరోజు నుంచి సినిమాకు పెద్దగా టికెట్స్ అయితే బుక్ కావడం లేదు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు…ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతోంది. అలాగే రజనీకాంత్ కెరీర్ లో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతోంది అనేది…