Waltair Veerayya: రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఊపు ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నేటి తరం స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా విడుదల చెయ్యడమే గగనం అయిపోతుంటే చిరంజీవి గారి ఈ ఏడాది అప్పుడే రెండు సినిమాలు విడుదల చేసేసాడు..అందులో ఒకటి ఆచార్య సినిమా కాగా, మరొకటి గాడ్ ఫాదర్..ఆచార్య సినిమా డిజాస్టర్ ఫ్లాప్ కాగా, గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది..ఈ సినిమాతో పాటుగా ఆయన సమాంతరంగా వాల్తేరు వీరయ్య మరియు భోళా శంకర్ వంటి సినిమాలు కూడా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

వాల్తేరు వీరయ్య చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..వాల్తేరు వీరయ్య విడుదలైన తర్వాత ఏడాది సమయం లోనే మూడు సినిమాలను ఇటీవల కాలం లో విడుదల చేసిన ఏకైక స్టార్ హీరో గా చిరంజీవి నిలవబోతున్నాడు..ఇక ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న విషయం మన అందరికి తెలుసు.
రవితేజ ఈ సినిమా లో చిరంజీవి కి సవితి తల్లికి కొడుకుగా నటించబోతున్నాడట..ఆయన పాత్ర పేరు ‘వైజాగ్ రంగరాజు’ అని కూడా తెలుస్తుంది..ఈ చిత్రం లో చిరంజీవి మరియు రవితేజ మధ్య వచ్చే క్లాష్ మరియు పోరాట సన్నివేశాలు అభిమానులకు రోమాలు నిక్కపొడుక్కుకునేలా చేస్తుందట..చిరంజీవి ఈ సినిమాలో జాలరి పాత్ర పోషిస్తుండగా, రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్నాడు..ఇటీవలే రాజముండ్రి లో ఒక కీలకమైన షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంబించుకుంది..ఇప్పటికే ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన లుక్ సోషల్ మీడియా లో లీక్ అవ్వగా వాటికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ దీపావళి కి ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయబోతుంది మూవీ టీం..దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది..ఈ మూవీ లో చిరంజీవి నుండి అభిమానులు ఏవైతే కోరుకుంటారో అన్ని ఉండేట్లు ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ బాబీ..చూడాలి మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది.