https://oktelugu.com/

Chiranjeevi : చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా ఆ మూవీ ఇన్స్పిరేషన్ తో తెరకెక్కుతుందా..?

సినిమా ఇండస్ట్రీ చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడం ముందుకు సాగుతూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 12, 2024 / 12:01 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi : సినిమా ఇండస్ట్రీ చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడం ముందుకు సాగుతూ ఉంటారు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవకాశాలను ఇస్తుంది. వాటిని సరిగ్గా వాడుకున్న వాళ్ళు స్టార్లుగా వెలుగొందితే వాడుకోలేని వాళ్ళు మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు….ఇక ప్రస్తుతం స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్లు వాళ్ళకంటూ ఒక సక్సెస్ ఫార్ములాను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్న వాళ్లే కావడం విశేషం…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఎందుకంటే తెలుగు సినిమా ఆడియన్స్ మాస్ సినిమాలను చూస్తూ ఎక్కువగా ఎంటర్ టైన్ అవుతున్నారు. అందుకే ఆ సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు రావు… కానీ కమర్షియల్ సినిమాలకు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు భారీ కలెక్షన్లు వస్తూనే ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు కమర్షియల్ డైరెక్టర్లు గా గుర్తింపును సంపాదించుకున్నారనే చెప్పాలి… ఇక అందులో అనిల్ రావిపూడి ఒకరు… ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా దర్శకుడిగా ఆయనకు ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. కాబట్టి ఆయన ఇండస్ట్రీ లో ఇన్ని రోజులపాటు సర్వెవైల్ అవుతున్నాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను చేసిన ఆయన సంక్రాంతి రోజు ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత తన తదుపరి సినిమాని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్టుగా కూడా ఆయన అనౌన్స్ చేయడం విశేషం…

    ఇక ఈ సినిమా కూడా కమర్షియల్ పంథాలోనే సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అంటూ చాలా రోజుల నుంచి ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఆ సినిమా ఇప్పటి వరకైతే ఇంకా పట్టాలెక్కలేదు.

    ఇక ఇప్పుడు వేరే కథతో సినిమా చేయాలని అనిల్ రావిపూడి అనుకున్నాడట. కానీ ఇప్పుడు మాత్రం చిరంజీవి పాత సినిమా అయిన గ్యాంగ్ లీడర్ ఇన్స్పిరేషన్ తో ఒక కథను రాసుకున్నాడట. ఇప్పుడు ఆ కథని చిరంజీవితో తెరకెక్కించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే సన్నాహాలు కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్న అనిల్ రావిపూడి తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి చిరంజీవి లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఎవరికీ ఆ అవకాశం అయితే రాకుండా అనిల్ రావిపూడి లాంటి ఒక యంగ్ డైరెక్టర్ కి అవకాశాలు రావడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…