https://oktelugu.com/

‘బిగ్ బాస్’ గ్లామర్ షోగా మారనుందా?

బుల్లితెర రియల్టీ ‘బిగ్ బాస్’కు ప్రేక్షకుల్లో భారీ క్రేజీ ఉంది. బిగ్ బాస్-1, బిగ్ బాస్-2, బిగ్ బాస్-3 షోలతో నిర్వాహకులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. దీంతో త్వరలోనే బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభించేందుకు నిర్వహాకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంటెస్ట్ ఎంపిక కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నాలుగో సీజన్ పై అంచనాలు పెంచేలా ‘బిగ్ బాస్’ గ్లామర్ భామలను రంగంలోకి దింపుతున్నాడు. ఎంపీ ఊహించినట్లే.. ప్రభుత్వం షాక్ ఇచ్చిందా? ఈసారి బిగ్ బాస్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 1, 2020 / 02:41 PM IST
    Follow us on


    బుల్లితెర రియల్టీ ‘బిగ్ బాస్’కు ప్రేక్షకుల్లో భారీ క్రేజీ ఉంది. బిగ్ బాస్-1, బిగ్ బాస్-2, బిగ్ బాస్-3 షోలతో నిర్వాహకులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. దీంతో త్వరలోనే బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభించేందుకు నిర్వహాకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంటెస్ట్ ఎంపిక కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నాలుగో సీజన్ పై అంచనాలు పెంచేలా ‘బిగ్ బాస్’ గ్లామర్ భామలను రంగంలోకి దింపుతున్నాడు.

    ఎంపీ ఊహించినట్లే.. ప్రభుత్వం షాక్ ఇచ్చిందా?

    ఈసారి బిగ్ బాస్ షో చాలా హాట్ ఉండబోతుంది. టాలీవుడ్లో గ్లామర్ తో అదరగొట్టిన పలువురు భామలు ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే బిగ్ బాస్ నిర్వహాకులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు పూనమ్ భజ్వా, శ్రద్ధాదాస్, హంసనందిలు ఈ షోకు ఎంపికైనట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళంలో పునమ్ భజ్వాకు మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్, బాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాదాస్, ఐటమ్ భామగా పేరుతెచ్చుకున్న హంసనందినిలు బిగ్ బాస్-4లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ హాట్ బ్యూటీలతో బిగ్ బాస్ నాలుగో సీజన్ కు మరింత క్రేజ్ రావడం ఖాయమని నిర్వహాకులు భావిస్తున్నారు.

    తోక జాడించే వారిపై వైసీపీ అదిరిపోయే ప్లాన్

    12మంది కాంటెస్టులతోపాటు నాలుగురు వైల్డ్ కార్డు ఎంట్రీలతో మొత్తం 16మంది కాంటెస్టులతో బిగ్ బాస్-4 సీజన్ ఉంటుందనుందని సమాచారం. వీరిలో బిత్తిరి సత్తి, సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ, తాగుబోతు రమేష్ పేర్లు కాన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో బిగ్ బాస్-4 ప్రారంభించేందుకు నిర్వహాకులు సన్నహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన సెట్ అన్నపూర్ణ స్టూడియోలో వేసినట్లు తెలుస్తోంది. నాలుగో సీజన్ కు హోస్టుగా కింగ్ నాగార్జున లేదా ఆయన కోడలు అక్కినేని సమంతల పేర్లు విన్పిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు నిర్వాహాకులు సిద్ధమవుతున్నారు.