ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

ప్రజారోగ్యానికి మన ప్రభుత్వాలు ఎంత విలువ ఇస్తుంటాయి.? అమెరికాలో అయితే దేశంలో దిగగానే మొదట హెల్త్ ఇన్స్ రెన్స్ చేయిస్తారట. లేదంటే ఆ దేశంలో రూల్స్ ఒప్పుకోవని చెబుతారు. ఏదైనా జబ్బు పడితే రూపాయి ఖర్చు లేకుండా ఆ ఇన్స్ రెన్స్ తో మనం సేఫ్ కావచ్చు. ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే అమెరికాలో బతకడం కష్టం. అందుకే పట్టుబట్టి చేపిస్తారట.. ఇక అమెరికా దేశం కూడా ప్రజారోగ్యానికి అత్యంత భారీగా ఖర్చు చేస్తుంది.. అన్ని దేశాలు ప్రజారోగ్యం విషయంలో […]

Written By: NARESH, Updated On : July 1, 2020 4:10 pm
Follow us on


ప్రజారోగ్యానికి మన ప్రభుత్వాలు ఎంత విలువ ఇస్తుంటాయి.? అమెరికాలో అయితే దేశంలో దిగగానే మొదట హెల్త్ ఇన్స్ రెన్స్ చేయిస్తారట. లేదంటే ఆ దేశంలో రూల్స్ ఒప్పుకోవని చెబుతారు. ఏదైనా జబ్బు పడితే రూపాయి ఖర్చు లేకుండా ఆ ఇన్స్ రెన్స్ తో మనం సేఫ్ కావచ్చు. ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే అమెరికాలో బతకడం కష్టం. అందుకే పట్టుబట్టి చేపిస్తారట.. ఇక అమెరికా దేశం కూడా ప్రజారోగ్యానికి అత్యంత భారీగా ఖర్చు చేస్తుంది..

అన్ని దేశాలు ప్రజారోగ్యం విషయంలో కోట్లు ఖర్చు చేస్తుంటాయి. అదేందో భారతదేశానికి వచ్చేసరికి ఈ దరిద్రం ఎక్కువైపోయింది. సంక్షేమానికి, ఉచితాలకు వరద పారిస్తూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తుంటారు.

తోక జాడించే వారిపై వైసీపీ అదిరిపోయే ప్లాన్

మన దేశంలో విద్య, వైద్యమే అత్యంత ఖరీదైనవి.. ఈ రెండింటిలో ప్రైవేట్ ఆధిపత్యం ఉంది. కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతున్నా మన ప్రభుత్వాలు కల్లు ఉండి చూడలేని దైన్యం కనిపిస్తుంటుంది.

అంతదాకా ఎందుకు దేశంలో కరోనా విజృంభిస్తోంది. వేల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కనిపిస్తోంది. తెలంగాణలో వైద్యం అందక ఇద్దరు మరణించారు. ఓ జర్నలిస్ట్ వైద్యం అందక కన్నుమూశాడు. మన ప్రభుత్వాలు వైద్యంపై బడ్జెట్ లో కేటాయించేది కనీసం 10శాతం కూడా ఉండడం లేదు..

కానీ ఏపీ సీఎం జగన్ సాధించాడు. తన తండ్రి నెలకొల్పిన 108, 104 సేవలను పునరుద్దరించాడు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో 1088 వాహనాలను సీరియల్ గా నిలబెట్టి జాతరలా వాటిని ప్రారంభించిన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. జగన్ ప్రజారోగ్యానికి ఇచ్చిన విలువ ఏంతనో దీని ద్వారా అందరికీ తెలిసివచ్చింది.

ఎంపీ ఊహించినట్లే.. ప్రభుత్వం షాక్ ఇచ్చిందా?

తాజాగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. జగన్ గట్స్ కు ఢిల్లీ పెద్దలు, జర్నలిస్టులు కూడా కరిగిపోయారు. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించారు. జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. దేశంలోని మిగిలిన వారు ఏపీని ఫాలో కావాలంటూ ఆయన ట్వీట్ చేసి ప్రశంసలు కురిపించారు.

ఇలా జగన్ ప్రజాసంక్షేమమే కాదు.. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించారు. 1088 వాహనాలను ప్రతీ మండలం, జిల్లాకు పంపి అందిరికీ వైద్య పరీక్షలు చేయించేందుకు.. కరోనాను అరికట్టేందుకు పూనుకున్నారు. జగన్ చర్య దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది.

-ఎన్నం