https://oktelugu.com/

రేపు క్యాబినెట్ మీటింగ్.. హైదరాబాద్ ఖాళీ..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజుకురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మహమ్మరి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన రేపుతోంది. తెలంగాణకు తలమానికంగా నిలిచే భాగ్యనగరం మహమ్మరి గుప్పిట్లో చిక్కుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలోనే కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం మరోసారి హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నగరవాసుల నుంచి విజ్ఞఫ్తులు చేస్తున్నారు.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 1, 2020 / 02:02 PM IST
    Follow us on


    తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజుకురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మహమ్మరి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన రేపుతోంది. తెలంగాణకు తలమానికంగా నిలిచే భాగ్యనగరం మహమ్మరి గుప్పిట్లో చిక్కుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలోనే కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం మరోసారి హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నగరవాసుల నుంచి విజ్ఞఫ్తులు చేస్తున్నారు..

    ఎంపీ ఊహించినట్లే.. ప్రభుత్వం షాక్ ఇచ్చిందా?

    తాజాగా కేంద్రం ఆన్ లాక్ 2.0ను జూలై 31వరకు కొనసాగుతుందని ప్రకటించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జులై 31వరకు రాష్ట్రంలో ఆన్ లాక్ 2.0 ఉంటుందని ప్రకటించారు. అయితే రేపు క్యాబినేట్ సమావేశం కానుండటంతో హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందా? ఉండదా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. లాక్డౌన్ విధిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సీఎం కేసీఆర్ అధికారులకు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్డౌన్ విధిస్తారనే ప్రచారంతో ఇప్పటికే నగరవాసులు మార్కెట్లకు పోటెత్తుతున్నారు. తమకు కావాల్సిన సరుకులను నగరవాసులు ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు.

    తోక జాడించే వారిపై వైసీపీ అదిరిపోయే ప్లాన్

    లాక్డౌన్ ప్రచారం నేపథ్యంలో మరికొందరు సొంతఊళ్లకు బయలు దేరుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులతో రద్దీగా మారుతున్నాయి ఆంధ్రప్రాంతానికి చెందిన వాళ్లు ఏపీకి వెళుతుండటంతో సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. జూన్ 3నుంచి 15రోజులపాటు జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం హైదరాబాద్లో జోరుగా సాగుతోంది. ఈసారి లాక్డౌన్ చాలా కఠినంగా అమలు చేసేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేవలం 2గంటలే నిత్యావసర కొనుగోలుకు అనుమతి ఉంటుందని తెలుస్తోంది. మిగతాదంతా కర్ఫూ కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది.

    ఇప్పటికే పలువురు వ్యాపారులు హైదరాబాద్లో స్వచ్చంధ లాక్డౌన్ పాటిస్తున్నారు. వీరి బాటలోనే వ్యాపారులంతా లాక్డౌన్ విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈమేరకు రేపు క్యాబినెట్ సమావేశం ఉండటంతో సీఎం కేసీఆర్ సంపూర్ణ లాక్డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.