https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ కి బెయిల్ రద్దు అవ్వనుందా..? హైదరాబాద్ పోలీసులు ఇలా పగబట్టేశారేంటి!

అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. బయటకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ని కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులందరూ ఆయన ఇంటి వద్ద క్యూలు కట్టడం మనమంతా చూసాము. తనకి బెయిల్ వచ్చేందుకు కృషి చేసిన చిరంజీవి, నాగబాబులకు కృతఙ్ఞతలు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి తెలిపాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 17, 2024 / 03:59 PM IST

    Allu Arjun Arrested(30)

    Follow us on

    Allu Arjun: గత మూడు రోజుల నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఎంతటి సంచలనాలకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంత పెద్ద పాన్ ఇండియన్ స్టార్ ని అరెస్ట్ చేసేలోపు ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్, పోలీసుల ప్రోటో కాల్స్ ని అనుసరించకపోవడం వల్లే రేవతి అనే మహిళ తొక్కిసిలాటలో చనిపోయిందని ఆయనపై FIR వేసి అరెస్ట్ చేసారు. అనంతరం అనేక నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. బయటకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ని కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులందరూ ఆయన ఇంటి వద్ద క్యూలు కట్టడం మనమంతా చూసాము. తనకి బెయిల్ వచ్చేందుకు కృషి చేసిన చిరంజీవి, నాగబాబులకు కృతఙ్ఞతలు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి తెలిపాడు.

    ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ కి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. అతనికి మంజూరు చేసిన బైలుని రద్దు చేయాల్సిందిగా హై కోర్టుకి అప్పీల్ చేయడానికి సిద్ధమయ్యారు హైదరాబాద్ పోలీసులు. ప్రస్తుతం పై అధికారులతో చర్చలు జరుపుతున్నారట. వాళ్ళ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే పిటీషన్ ని వేసే అవకాశాలు ఉన్నాయట. ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ అల్లు అర్జున్ మీద పోలీసులు ఇలా పగబట్టేశారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్ననే పోలీసులు అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూడడానికి వచ్చేందుకు మేము అనుమతులు ఇవ్వడంలేదని, అందుకు సంబంధించిన లేఖ ఇదేనంటూ మీడియా కి ఒక కాపీని విడుదల చేసారు. అయితే ఈ కాపీ నమ్మశక్యంగా లేదని అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ వేశారు. ఇది కేవలం అల్లు అర్జున్ ని ఇరకాటం లో పెట్టడానికి అప్పటికప్పుడు సృష్టించిన లేఖ లాగా అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేసారు.

    వాళ్ళ దగ్గర ఈ సాక్ష్యం ముందు నుండే ఉంటే మొన్న బెయిల్ విచారణ సమయంలో కోర్టు వాళ్లకి ఎందుకు సబ్మిట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల, ఆయన ఈగో దెబ్బతినిందని, దానిని మనసులో పెట్టుకొనే ఇదంతా చేస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. మరోపక్క శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై అల్లు అర్జున్ టీం ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. అతని ఆరోగ్యం మెరుగుపడడానికి సింగపూర్ నుండి ఒక ఇంజక్షన్ తెప్పించాలని, దానికి చాలా ఖర్చు అవుతుందని అల్లు అర్జున్ కి చెప్పడంతో, వెంటనే ఆయన స్పందించి ఆ ఇంజక్షన్ ని సింగపూర్ నుండి తెప్పించాడని తెలుస్తుంది. కేసు కోర్టులో నడుస్తున్నందున ఇప్పటికైతే శ్రీ తేజ్ ని కలిసే పరిస్థితులు లేవని, త్వరలోనే ఈ సమస్యలు సర్దుకున్నాక శ్రీతేజ్ ని కలుస్తానని ఆయన చెప్పుకొచ్చాడు.