Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, వైల్డ్ ఫైర్ లాగా గేమ్స్ ని ఆడుతూ, టైటిల్ విన్నర్ రేస్ లో నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీని ఇచ్చి, అతి స్వల్ప మెజారిటీ తో రన్నర్ గా నిల్చిన గౌతమ్ కి ఎలాంటి ఫ్యాన్స్ ఏర్పడ్డారో మన అందరికీ తెలిసిందే. నిఖిల్ కి తెలుగు ఆడియన్స్ సపోర్టు తో పాటు, కన్నడ ఆడియన్స్ సపోర్టు కూడా ఉంది. ఆయన పీఆర్ టీం కన్నడ ప్రేక్షకులతో ఓట్లు వేయించడానికి సోషల్ మీడియా లో తెగ కష్టపడ్డారు. అంతే కాదు నిఖిల్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మంచిగా స్నేహం చేయడం వల్ల, వాళ్ళు ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చిన తర్వాత నిఖిల్ కి తమ ఫ్యాన్స్ ఓట్లు వేసేలా ప్రొమోషన్స్ చేసారు. కానీ గౌతమ్ కి ఇవేమి లేవు. సోలో గా హౌస్ లో ఎలా ఉన్నాడో, బయట కూడా అంతే.
కేవలం తన ఆట తీరుతోనే ఓట్లు రప్పించుకున్నాడు. ఆ ఓటింగ్ తో ఇంత బ్యాకప్ ఉన్న నిఖిల్ కి సమానంగా ఓట్లు దక్కించుకున్నాడంటే ఆయన ఈ గేమ్ లో ఎలాంటి ప్రభావం చూపించాడో అర్థం చేసుకోవచ్చు. అయితే గౌతమ్ హౌస్ లో ఉన్నన్ని రోజులు తన తలకు ఎర్ర తువ్వాలు కట్టుకొని తిరిగేవాడు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్ల కోసమే చేస్తున్నాడని, హౌస్ లో ఉన్నప్పుడు యష్మీ, ప్రేరణ, విష్ణు ప్రియా మాట్లాడుకునేవాళ్ళు. సోషల్ మీడియా లో కూడా దీనిపై నెటిజెన్స్ చాలా చర్చించుకున్నారు. ఇదే విషయాన్ని గౌతమ్ బయటకి వచ్చిన తర్వాత మీడియా అడిగింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ ‘నేను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని. కేవలం పవన్ కళ్యాణ్ అభిమాని అవ్వడం వల్లే నేను ఈ ఎర్ర తువ్వాల తలకు చుట్టుకోలేదు. ఈ ఎర్ర తువ్వాలు మన తెలుగోడి కష్టానికి చిహ్నం. ఏదైనా పని చేసేటప్పుడు నాకు ఈ ఎర్ర తువ్వాల తలకు చుట్టుకుంటే ఒక రేంజ్ పవర్ వచ్చేస్తుంది’ అని చెప్పుకొచ్చాడు గౌతమ్.
యష్మీ తో నిజంగానే లవ్ ట్రాక్ నడిపాలనుకున్నావా?, లేకపోతే కేవలం కంటెంట్ కోసమే ఈ ట్రాక్ ని తీసుకొచ్చావా అని అడిగిన ప్రశ్నకి గౌతమ్ సమాధానం చెప్తూ ‘యష్మీ మీద నాకేమి ప్రేమ లేదు. కేవలం క్రష్ అని మాత్రమే చెప్పాను. పెళ్ళైన వాళ్ళు కూడా నేనంటే క్రష్ అని చెప్పినోళ్లు చాలా మంది ఉన్నారు. అలా చెప్పారు కదా అని వాళ్లంతా నన్ను ప్రేమిస్తున్నట్టా?, కాదు కదా, క్రష్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. ఎప్పుడైతే నాకు A,B,C కాన్సెప్ట్ తెలిసిందో అప్పటి నుండే నేను ఆమెతో సంబంధాలు మొత్తం కట్ చేసేసాను, కేవలం తోటి కంటెస్టెంట్ గా మాత్రమే చూసాను’ అని చెప్పుకొచ్చాడు గౌతమ్.
