Rachin Ravindra: రచిన్ రవీంద్ర ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లలో ఒకడు. 1999, నవంబర్ 18 వెల్డింగ్ టన్ లో ఇతడు పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఇతడికి క్రికెట్ అంటే ఇష్టం. అతని ఇష్టాన్ని గమనించి తల్లిదండ్రులు క్రికెట్ వైపు మళ్ళించారు. క్రికెట్ లో దేశవాళీ సత్తా చాటాడు. దీంతో అతడు న్యూజిలాండ్ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. వచ్చిన అవకాశాలను రచిన్ రవీంద్ర సద్వినియోగం చేసుకున్నాడు. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు. తుఫాన్ వేగంతో బ్యాటింగ్ చేయడంలో నేర్పు సాధించాడు. ఫలితంగా వర్ధమాన క్రికెటర్లలో మేటి ఆటగాడిగా ఎదిగాడు. ఐపీఎల్ లో మొన్నటిదాకా చెన్నై జట్టుకు ఆడిన అతడు.. ఈ సంవత్సరం బెంగళూరు జట్టులోకి వెళ్లిపోయాడు. ఇక ఇటీవల భారత జట్టుతో జరిగిన టెస్ట్ పరుగుల వరద పారించాడు. అతడి దూకుడైన బ్యాటింగ్ వల్ల భారత్ మూడు టెస్టులలో ఓటమిపాలైంది. వాస్తవానికి భారత మైదానాలు బ్యాటింగ్ చేయడానికి క్లిష్టతరంగా ఉంటాయి. ఆయనప్పటికీ అవేవీ పట్టించుకోకుండా రచిన్ దూకుడైన ఆట తీరు ప్రదర్శించాడు.. ఫలితంగా న్యూజిలాండ్ భారత జట్టుపై తొలిసారిగా టెస్టు సిరీస్ ను వైట్ వాష్ చేసింది. ఇది భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. రచిన్ రవీంద్ర ఇప్పుడు మాత్రమే కాదు.. భారత జట్టు కంటే ముందు ఇతర జట్టతో జరిగిన టెస్ట్ సిరీస్ లలోనూ సత్తా చాటాడు. అందువల్లే అతడు టెస్ట్ క్రికెట్లో మేటి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక 2023-25 డబ్ల్యూటీసీ లో అతడి గణాంకాలు కూడా బాగానే ఉన్నాయి. ఇక ఇటీవల ఇంగ్లాండు జట్టుతో ప్రారంభమైన తొలి టెస్ట్ అతనికి పదవ మ్యాచ్.
34 పరుగులు..
ఇంగ్లాండ్ జట్టుతో ఇటీవల క్రైస్ట్ చర్చి వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్లో రచిన్ 34 పరుగులు చేశాడు. మొత్తంగా టెస్ట్ క్రికెట్లో 889 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్ లలో అతడు ఈ ఘనత సాధించాడు. అతడు 49.38 సగటుతో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 61.01 కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ లో న్యూజిలాండ్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రచిన్ రవీంద్ర కొనసాగుతున్నాడు. ఓవరాల్ గా ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ హైయెస్ట్ స్కోరర్ గా ఉన్నాడు. ఇటీవల భారత్ వేదికగా భారత జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో రచిన్ రవీంద్ర వీరోచితమైన బ్యాటింగ్ చేశాడు. కఠినమైన భారత మైదానాలపై సత్తా చాటాడు. బెంగళూరు మైదానంలో జరిగిన తొలి టెస్ట్ లో సెంచరీ చేశాడు.. పూణే మైదానంలో జరిగిన రెండవ టెస్టులోనూ సత్తా చాటాడు. ఐపీఎల్ లో అతడు భారత మైదానాలపై ఆడిన నేపథ్యంలో.. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో సత్తా చాటాడు. మొత్తంగా సమకాలిన టెస్ట్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. అతడు ఇదే తరహాలో బ్యాటింగ్ చేస్తే టెస్ట్ క్రికెట్లోనూ అద్భుతమైన ఆటగాడిగా ఆవిర్భవిస్తాడని క్రికెట్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.