Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ‍్యతలు చేపట్టడంతో భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్ చెందిరిపోతోంది. తమ పిల్లలు అమెరికాలు ఉన్నత చదువులు చదివి.. అక్కడే ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంలో మధ్య తరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అమెరికా ఫ్లైట్ ఎక్కించారు. ఎడ్యుకేషన్ వీసాపై వెళ్లిన విద్యార్థులు అక్కడే పార్ట్‌టైం జాబ్స్ చేస్తూ.. నిబంధనల ప్రకారం అమెరికాకు అవసరమైన బ్యాంకు బ్యాలెన్స్ చూపుతున్నారు. అయితే చదువు కోసం వచ్చి.. అనేక మంది ఇక్కడే స్థిరపడే ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించిన ట్రంప్ సర్కార్.. చదువు కోసం వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న విద్యార్థులపై నిఘా పెట్టింది. దీంతో చాలా మంది విద్యార్థులు పార్ట్‌టైం జాబ్స్ వదిలేస్తున్నారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఖాతాల్లో డబ్బులు వేయాలని కోరుతున్నారు. అమెరికా పంపేందుకే అప్పులు చేసిన మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఇప్పుడు మరింత అప్పుల చేయాల్సిన పరిస్థితి.
గుర్తింపు, గౌరవం ఉంటుందని..
అమెరికాలో తమ పిల్లలు చదువుకుంటే.. పిల్లలతోపాటు తమకూ గుర్తింపు, గౌరవం దక్కుతాయని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇందు కోసం అప్పులు చేసి మరీ తమ పిల్లలను అగ్రరాజ్యానికి పంపించారు. చదువు పూర్తయిన ఆరు నెలల్లో జాబ్ సాధించి అక్కడే స్థిరపడతారని భావించారు. దీంతో డబ్బులతోపాటు తమ ఇమేజ్ పెరుగుతుందని కలలుకన్నారు. అయితే ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక వారి కలలను కల్లలు చేస్తున్నారు. డాంకీ రూట్‌లో వచి‍్చన విద్యార్థులను వేటాడుతున్నారు. అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నాడు. దీంతో తమ పిల్లల పరిస్థితి ఏమవుతుందో అని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
స్వదేశాలకు పంపించేందుకు భారీగా ఖర్చు..
మరోవైపు ట్రంప్ అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపించేందుకే ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ఒక్కొక్కరికి 4,500 డాలర్లు ఖర్చు చేస్తున్నారు. అంటే భారతీయ కరెన్సీలో రూ.4 లక్షలు. ఇక అక్రమంగా అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 30 వేల మంది అక్రమంగా అగ్రరాజ్యం యూనివర్సిటీల్లో చేరి అక్కడే పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. రోజుకు 8 నుంచి పది గంటలు పనిచేసి లక్షలు సంపాదించారు. తాజాగా ట్రంప్ నిఘాతో ఎక్కడ దొరికిపోతామో అని జాబ్‌లు వదిలేస్తున్నారు. వర్సిటీల్లోనే తలదాచుకుంటున్నారు. మరోవైపు అక్కడే ఉండేందుకు, ఖర్చలకు డబ్బులు పంపలని తల్లిదండ్రులను కోరుతున్నారు.
చట్టాలు సడలించాలి..
ఇప్పటికే అప్పులపాలైన తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులు ఎలా పంపాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అమెరికా ప్రభుత్వం చట్టాలు సవరించాలని కోరుతున్నారు. తమ పిల్లలు పార్ట్‌టైం జాబ్స్ చేసుకునే అవకాశం కల్పించాలంటున్నారు. ఇదిలా ఉంటే… ట్రంప్ ప్రభుత్వం గుర్తించిన అక్రమ వలసదారుల్లో భారత్‌కు చెందినవారు 18 వేలు ఉన్నట్లు తెలిసింది. వీరిని విడతలవారీగా స్వదేశానికి పంపనుంది అగ్రరాజ్యం.