Homeఎంటర్టైన్మెంట్Spirit movie star heroes rejected: 'స్పిరిట్' సినిమాను ఆ స్టార్ హీరోలిద్దరూ రిజెక్ట్ చేయడానికి...

Spirit movie star heroes rejected: ‘స్పిరిట్’ సినిమాను ఆ స్టార్ హీరోలిద్దరూ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా..?

Spirit movie star heroes rejected: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డివంగ తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన చేస్తున్న స్పిరిట్ సినిమా అతనికి భారీ గుర్తింపు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. అలాంటి సందీప్ రెడ్డివంగ ఈ సినిమాతో టాప్ డైరెక్టర్ గా మారాలంటే మాత్రం ఈ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాల్సిన అవసరమైతే ఉంది. వచ్చే సంవత్సరం మార్చి 5వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ‘స్పిరిట్’ సినిమా కథని ప్రభాస్ కంటే ముందే సందీప్ రెడ్డి వంగ ఒక ఇద్దరు హీరోలకైతే వినిపించారట. ఆ ఇద్దరు హీరోలు కూడా దానిని రిజెక్ట్ చేయడంతో ప్రభాస్ దగ్గరికి ఈ కథ వచ్చింది.

ఇంతకీ ఆ ఇద్దరు హీరోలెవరు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న మహేష్ బాబు ఒకరైతే అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న రన్వీర్ సింగ్ మరొకరు కావడం విశేషం…అనిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ రణ్వీర్ సింగ్ కి ఈ కథనైతే చెప్పారట. రన్వీర్ సింగ్ అప్పుడున్న కమిట్మెంట్స్ వల్ల కొద్దిరోజులు టైమ్ అడిగాడట.

కానీ సందీప్ మాత్రం టైమ్ ఇవ్వకపోవడం అలాగే ప్రభాస్ డేట్స్ ఖాళీగా ఉండడంతో ప్రభాస్ కి చెప్పి అతని చేత ఒప్పించాడు. ఇక రణ్వీర్ సింగ్ తో పాటు మహేష్ బాబు ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశాడు అంటు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ‘అనిమల్’ కథ కూడా సందీప్ మొదట మహేష్ బాబుకే వినిపించాడు. కానీ ఆయన ఆ సినిమాని కూడా చేయలేదు. సందీప్ సినిమాల్లో వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది.

అలాగే బోల్డ్ సీన్స్ కూడా విపరీతంగా ఉంటాయనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు సందీప్ ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో సందీప్ రెడ్డి వంగ తో సినిమా చేస్తాను అంటూ చెప్పినప్పటికి తన ఇమేజ్ కి తగ్గట్టుగా కథ సెట్ చేసుకొని వస్తేనే తప్ప సందీప్ తో సినిమా చేసే అవకాశం లేదు అంటూ మహేష్ బాబు సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular