Khalistani Activist: ఖలిస్తానీ కార్యకర్త కొకైన్‌ స్మగ్లింగ్‌.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అమెరికా పోలీసులు

ఖలిస్తానీ కార్యకర్తగా గుర్తింపు ఉన్న కమల్‌సింగ్‌ అలియాస్‌ సూర్మ భారత వ్యతిరేక కార్యకలాపాలకే నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే 1.5 మిలియన్‌ డాలర్ల విలువైన 50 కిలోల కొకైన్‌ను అక్రమంగా రవాణా చేయడానికి యత్నించాడు.

Written By: Raj Shekar, Updated On : May 20, 2024 10:57 am

Khalistani Activist

Follow us on

Khalistani Activist: అగ్రరాజ్యం అమెరికా పోలీసులకే ధమ్కీ ఇవ్వాలనుకున్నాడు ఖలిస్తానీ కార్యకర్త. భారతీయ సంతతికి చెందిన అతడు 1.5 మిలియన్‌ డాలర్ల విలువ చేసే 50 కిలోల కొకైన్‌ను స్మగ్లింగ్‌ చేస్తూ రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఈ సందర్భంగా మూర్చపోయినట్లు నటించి అక్కడి పోలీసులనే మస్కా కొట్టాలనుకున్నాడు. కానీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కమల్‌ సింగ్‌ అలియాస్‌ సూర్మ..
ఖలిస్తానీ కార్యకర్తగా గుర్తింపు ఉన్న కమల్‌సింగ్‌ అలియాస్‌ సూర్మ భారత వ్యతిరేక కార్యకలాపాలకే నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే 1.5 మిలియన్‌ డాలర్ల విలువైన 50 కిలోల కొకైన్‌ను అక్రమంగా రవాణా చేయడానికి యత్నించాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుపడ్డాడు. పాకిస్థాన్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐకి నిధులు అందిస్తున్నట్లు గుర్తించారు. అయితే కమల్‌సింగ్‌ అరెస్ట్‌ను అమెరికా పోలీసులు అదికారికంగా ప్రకటించలేదు.

వీడియో వైరల్‌..
అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఖలిస్తానీ కార్యకర్త కమల్‌సింగ్‌ను నడుపుతున్న వాహనంలో కొకైన్‌ ఉన్నట్లు గుర్తించిన వీడియో వైరల్‌ అవుతోంది. అధికారులు వామనం అడ్డగించి తనిఖీ చేయగా, అందులోని అట్ట పెట్టెల్లో కొకైన్‌ ఉన్నట్లు పోలీసులు స్పష్టంగా పేర్కొనడం వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో కమల్‌సింగ్‌ స్పృహతప్పినట్లు నటించాడు. పోలీసులు అతడిని సేవలు చేసి మెలకువ తెచ్చారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. కొకైన్‌ బయటకు తీశాక వాటి గురించి తనకు తెలియదు అని బుకాయించడం తర్వాత కూడా మళ్లీ స్పృహ కోల్పోయినట్లు నటించడం కనిపించింది.