బూతు వ్యవహారంలో వర్మ జోరు తగ్గింది !

కాంట్రవర్సీ రాయుడు రామ్ గోపాల్ వర్మ ఎందుకు ప్రస్తుతం రెచ్చిపోవడం లేదు అని అడుగుతున్నారు నెటిజన్లు. ఎక్కడా రెచ్చిపోవాలి ? దేనిమీద రెచ్చిపోవాలి అంటే.. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం మీద. దీనికి రామ్ గోపాల్ వర్మకి సంబంధం ఏముంది ? అంటే.. మరీ సుశాంత్ సింగ్ రాజపుత్ మరణానికి ? హీరోయిన్ల డ్రగ్స్ కేసులకు వర్మకి లింక్ ఏముంది ? ఎందుకు ఆయనగారు అప్పుడు వరుస ట్వీట్స్ తో రచ్చ లేపారు. అంత […]

Written By: admin, Updated On : July 26, 2021 11:20 am
Follow us on

కాంట్రవర్సీ రాయుడు రామ్ గోపాల్ వర్మ ఎందుకు ప్రస్తుతం రెచ్చిపోవడం లేదు అని అడుగుతున్నారు నెటిజన్లు. ఎక్కడా రెచ్చిపోవాలి ? దేనిమీద రెచ్చిపోవాలి అంటే.. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం మీద. దీనికి రామ్ గోపాల్ వర్మకి సంబంధం ఏముంది ? అంటే.. మరీ సుశాంత్ సింగ్ రాజపుత్ మరణానికి ? హీరోయిన్ల డ్రగ్స్ కేసులకు వర్మకి లింక్ ఏముంది ?

ఎందుకు ఆయనగారు అప్పుడు వరుస ట్వీట్స్ తో రచ్చ లేపారు. అంత రచ్చ చేసే వర్మ ఇప్పుడు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు. అసలు ఎందుకు ఈ ఇష్యూ పై స్పందించడం లేదు. సహజంగా ప్రతి విషయం పై నానా హడావుడి చెయ్యడం ఆర్జీవీకి అలవాటు. మరోపక్క తన భర్త నిర్మించినవి పోర్న్ చిత్రాలు కాదు అని, అవి కేవలం ఎరోటికా అనగా శృంగార కథతో తీసిన చిత్రాలు మాత్రమే అని పతివ్రతా శిరోమణి శిల్పాశెట్టి చెప్పుకొచ్చింది.

సాధారణంగా ఇలాంటి స్టేట్ మెంట్ ఇస్తే.. రామ్ గోపాల్ వర్మ ఆ స్టేట్ మెంట్ పై అనుకూలంగానో, ప్రతికూలంగానో ఒక ప్రకటన ఇస్తూ ఎంజాయ్ చేయడం ఆర్జీవీ అనే వింత జీవికి బాగా అలవాటు. కానీ ఎందుకు ఆర్జీవీ మౌనం వహిస్తున్నాడు ? వర్మ ఈ అంశంలో భయపడుతున్నాడా ? ఆ మధ్య ఈయనగారు నిర్మించిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా ఎరోటికా కిందకే వస్తాయి కాబట్టి,

అనవసరంగా ఈ విషయంలో ఎందుకు తల దూర్చడం అనుకుంటున్నాడా ? ఎలాగూ వర్మ సినిమాల పై కూడా ఎప్పటినుంచో అనేక విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ గొడవలో తలదూర్చితే తన బూతు సినిమాల పై ఫోకస్ పడితే, తనకే ముప్పు వస్తోందని వర్మ భావిస్తున్నాడా ? ఏది ఏమైనా ఈ బూతు వ్యవహారంలో వర్మ జోరు తగ్గిందనే చెప్పాలి.