Pushpa: రేపు “పుష్ప” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై హైప్ ప్రతిచోటా ఉంది. అడ్వాన్స్ బుకింగ్‌లు రెండు రాష్ట్రాలలో.. అమెరికాలో కూడా బాక్సాఫీస్ వద్ద పుష్ఫకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయట.. అయితే ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం “అల వైకుంఠపురములో” మొదటి రోజు కలెక్షన్స్ ను ‘పుష్ప’ దాటకపోవచ్చు. అని అంటున్నారు.
అలవైకుంఠపురంలో మూవీ మొదటి రోజు నైజామ్‌లో రూ. 4.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు “పుష్ప”కి ఈ సంఖ్య రూ. 7-8 కోట్ల మధ్య ఉండవచ్చు. తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. పైగా 5 షోలకు పర్మిషన్ ఇచ్చారు. మరే ఇతర స్థానిక సినిమాతో సమానమైన పోటీ లేదు కనుక తెలంగాణలో భారీగానే కలెక్షన్లు రాబట్టవచ్చు.
సీడెడ్‌లో “అలవైకుంఠపురంలో” మొదటి రోజు కలెక్షన్ రూ. 3 కోట్లు.. కోస్తా ఆంధ్రలో రూ. 12 కోట్లు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం నిర్ధేశించిన తక్కువ టిక్కెట్ ధరల కారణంగా “పుష్ప”కు భారీ నష్టాన్ని ఎదుర్కొంటుంది.
హైకోర్టు తీర్పు తర్వాత టిక్కెట్ ధరలను పెంచి విక్రయించవచ్చని చాలామంది ఊహిస్తున్నారు. అయితే ఎగ్జిబిటర్లు జాయింట్ కలెక్టర్ల నుండి సమ్మతి తీసుకున్న తర్వాత మాత్రమే టిక్కెట్ ధరలపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెబుతోంది. కాబట్టి మొదటి రోజు ఏపీలో అలవైకుంఠపురం సినిమా కలెక్షన్లను “పుష్ప” దాటకపోవచ్చు అంటున్నారు.
అలవైకుంఠపురంలో కర్ణాటకలో రూ. 1.74 కోట్లు, కేరళలో 028 కోట్లు, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో 1.8 కోట్లు సంపాదించింది. “పుష్ప” ఇప్పుడు కూడా దాదాపు అదే మొత్తంలో కలెక్షన్లు రాబట్టనుంది..
Also Read: ఆ అవమానం బన్నీలో మార్పుకి కారణమైంది !
కానీ అమెరికా విషయానికి వస్తే, అలవైకుంఠపురంలో ప్రీమియర్ నుంచి 809,072 డాలర్ల భారీ వసూళ్లు సాధించింది. ‘స్పైడర్‌మ్యాన్’ ప్రభావంతో తగినన్ని థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు “పుష్ప” 500,000 డాలర్ల దిగువకు పడిపోయింది.
కాబట్టి నైజాం – భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ‘పుష్ప’ ఊహించనంత పెద్ద సంఖ్యలో కలెక్షన్లు సాధిస్తేనే అది అలవైకుంఠపురంలో మొదటి రోజు కలెక్షన్‌ను తాకుతుంది. లేదంటే కష్టమే…
ఎందుకంటే స్పైడర్‌మ్యాన్ విడుదల కారణంతోపాటు ఏపీ ప్రభుత్వం కారణంగా అమెరికాతోపాటు ఏపీలో పుష్ప వ్యాపారం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది. సో అలవైకుంఠపురంలో కలెక్షన్లను ‘పుష్ప’ అందుకోవడం కష్టమేనంటున్నారు.
Also Read: అల్లు అర్జున్ “పుష్ప” అభిమానులకు స్వీట్ న్యూస్ ఇచ్చిన తెలంగాణ సర్కారు…