Aha Naa Pellanta: ‘అహనా పెళ్లంట’ మొదటి రోజు షూటింగ్ ను హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఆ సినిమాకి ఎస్. గోపాల్‌రెడ్డి కెమెరామేన్. అప్పటికే ఎస్. గోపాల్‌రెడ్డి లొకేషన్ కి వచ్చారు. అందరూ ఉన్నారు గానీ, అక్కడ జంధ్యాల గారు కనబడలేదు. జంధ్యాల కోసం వెతుకుతూ పక్కనే ఉన్న గుడి వైపు వెళ్లారు. ఆ గుడి వెనుక వైపు ఒక చిన్న ఇల్లు ఉంది. పక్కనే గొడ్ల సావిడిలో నుంచి జంధ్యాలగారి మాటలు వినిపిస్తున్నాయి.
‘సావిడిలో జంధ్యాలగారు ఏమి చేస్తున్నారయ్యా ?’ అని మేనేజర్ ను అడిగి గోపాల్‌రెడ్డి ఆసక్తిగా అటు వైపు వెళ్లారు. అక్కడ జంధ్యాలగారు, బ్రహ్మానందాన్ని కూర్చోపెట్టి అతని తల చుట్టూ ఒక తాడు కట్టి.. అక్కడున్న మంగలి వాడికి ఏవో సూచనలిస్తూ.. జంధ్యాలగారే చేతి వెళ్లతో ఇలా కత్తిరించు, అలా కత్తరించు అని చెబుతున్నారు.
అంతలో జంధ్యాల గోపాల్‌రెడ్డిని చూసి, ‘ గోపాల్‌రెడ్డి గారు మీరెళ్ళి షాట్స్ ప్లాన్ చేయండి ?’ అని గంభీరంగా అన్నారు. ‘షాట్స్ ఓకే, ఈ అరగుండు ఏమిటి సర్ ? అని నవ్వాడు గోపాల్ రెడ్డి. జంధ్యాల కోపంతో ఊగిపోతూ.. ‘నేను చెప్పిన షేప్ లోనే జుట్టు కత్తిరించు.. లేకపోతే నీ జుట్టు కత్తిరిస్తా’ అంటూ గోపాల్‌రెడ్డి వైపు చూశారు. కారుతున్న చమటలను తుడుచుకుంటూ కనిపించాడు గోపాల్‌రెడ్డి.
‘గోపాల్‌రెడ్డి గారు మీరు భయపడకండి.. నేను అన్నది అతన్ని, మిమ్మల్ని కాదు’ అని నవ్వుతూ చెప్పాడు జంధ్యాల. ‘పర్లేదు లేండి’ అని గోపాల్ రెడ్డి చిన్న నవ్వు నవ్వి ఏవో చెబుతున్నాడు. అంతలో సడెన్ గా జంధ్యాల గారు ఎదురుగా ఉన్న కూర్చుని ఈడ్చి తన్నారు. ఒకపక్క గోపాల్ రెడ్డి తన సంభాషణలు చెబుతున్న సమయంలోనే, జంధ్యాల గారు కూర్చి తనడంతో అందరూ షాక్ అయి గోపాల్ రెడ్డి వైపు చూస్తున్నారు.
అయితే, జంధ్యాల చూపు మాత్రం బ్రహ్మనందం క్రాఫ్ వైపే ఉంది. ఆయన కూర్చి ఎందుకు తన్నారో గోపాల్ రెడ్డికి అర్ధం అయింది. వెంటనే వెళ్లి మంగలి వాడికి వివరంగా అర్థం అయ్యేలా చెప్పాడు. వాడు కోపంగా చూస్తున్న జంధ్యాల వైపే భయంగా చూస్తూ మొత్తానికి చెప్పినట్టు జుట్టు కత్తిరించి ఆదరాబాదరా అక్కడ నుంచి తప్పించుకున్నాడు.
Also Read: Harihara Veeramallu Movie: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి జాక్వెలిన్ ఔట్… ఆమె స్థానంలో ఎవరంటే
‘ఏమయ్యా అరగుండు స్నానం చేసి రా పో’ అన్నారు జంధ్యాల. స్నానం ముగించుకుని వచ్చిన బ్రహ్మనందాన్ని దగ్గరకి పిలిచి ఇటూ అటూ తిప్పి తిప్పి చూసి “ఆ.. ఇది మనకు కావాల్సిన అరగుండు’ అని నేరుగా సెట్ లోకి వెళ్లిపోయారు. అప్పటికే సినిమాలకు కొత్త కావడంతో బ్రహ్మనందానికి అదంతా భయాన్ని కలిగించింది. ఆ భయంతోనే ‘అహనా పెళ్లంట’ సినిమాలో చాలా జాగ్రత్తగా నటించారట.
Also Read: Film Industry: చిత్ర పరిశ్రమకు కొత్త రూల్స్ ప్రకటించిన కార్మిక శాఖ…