Chandrababu- NTR: స్కిల్ డెవలాప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎంతో మంది స్పందించారు కానీ జూ. ఎన్టీఆర్ ఇప్పటికీ స్పందించలేదు. ఇప్పుడే కాదు ఈయన చాలా రోజుల నుంచి చంద్రబాబును కలిసి స్టేజ్ పంచుకోవడం లేదు. అంతేకాదు కలిసి ఒకదగ్గర కూడా కనిపించడం లేదు జూ. ఎన్టీఆర్. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు తారకు ఆహ్వానం పంపలేదట. ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమానికి పిలిచిన ఆయన వెళ్లలేదు. పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు హాజరైనా బర్త్ డే వేడుకల పేరు చెప్పి తారక వెళ్లలేదు. రీసెంట్ గా సీ. ఎన్టీఆర్ బొమ్మ తో రూపాయి నాణాన్ని విడుదల చేసిన కార్యక్రమానికి కూడా వెళ్లలేదు తారక్. అయితే ఇలా ఒక్కసారి మాత్రమే కాదు ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా మౌనం పాటిస్తున్నారు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్. మరి దీనికి కారణాలు మాత్రం పూర్తిగా తెలియడం లేదు.
బాబుకు రాజకీయపరంగా ఉపయోగపడే ఏ కార్యక్రమానికి అయినా వెళ్లకూడదని ఫిక్స్ అయ్యారట జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. 2009 ఎన్నికల తర్వాత టీడీపీకి, తారకు దూరం పెరిగడం వల్లే ఈ గ్యాప్ మరింత ఎక్కువ అయిందని టాక్. అయితే హరికృష్ణ చనిపోయిన తర్వాత మామ అల్లుల్ల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందనే అంటుంటారు కొందరు. రాజకీయంగా ఇబ్బంది ఉండదు అనుకునే కార్యక్రమాలకు చంద్రబాబు వస్తున్నా కూడా జూ. ఎన్టీఆర్ వెళ్తున్నారట. అయితే జూ. ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేయడంతో రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట.
ఇక మరో వాదన కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటుంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయనే భావనతో 2009 ఎన్నికల్లో ఆయన చేత చంద్రబాబు ప్రచారం చేయించారట.కానీ తన కుమారుడు లోకేశ్ కు ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆ తర్వాత ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారని.. అదే సందర్బంలో తారక్ ఎక్కువగా బాధ పడ్డారని తెలుస్తోంది. దీంతో మామ అరెస్ట్ అయినా కూడా చిన్న స్టేట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు రాజకీయ పెద్దలు.
అయితే చంద్రబాబు అరెస్ట్ పై రియాక్ట్ కావద్దని టీడీపీ పెద్దల నుంచి ఆడర్స్ ఉన్నాయట. ఒకవేల పొరపాటున ఏదైనా మాట్లాడినా కూడా ప్రతిపక్షాలు ఛాన్స్ తీసుకునే అవకాశం ఉండడంతో ఈ వ్యవహారంపై తారక్ మౌనం వహిస్తున్నారని మరో వాదన. వీటి గురించి క్లారిటీ రావాలంటే ఎన్టీఆర్ స్పందించాల్సిందే..