Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలకృష్ణ సినిమాలను పక్కనపెట్టి రాజకీయాల్లో ఎందుకు అంత యాక్టివ్ అయ్యారు?

Balakrishna: బాలకృష్ణ సినిమాలను పక్కనపెట్టి రాజకీయాల్లో ఎందుకు అంత యాక్టివ్ అయ్యారు?

Balakrishna: స్కిల్ డెవలాప్ మెంట్ స్కామ్ కింద చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత నుంచి ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ధర్నాలు, నిరసనలు, గొడవలు జరుగుతున్నాయి. అయితే చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడు లభిస్తుంది ? ముందులాగా పార్టీని ఎప్పుడు ముందుకు నడిపిస్తారు అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. అయితే చంద్రబాబు విడుదలపై బెయిల్ పై ఎన్నో అనుమానాలు ఉండడంతో పార్టీలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో టీడీపీలో నందమూరి బాలకృష్ణ కూడా యాక్టివ్ రోల్ తీసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది.

ఎప్పుడు లేని విధంగా ఈ సారి బాలకృష్ణ అలర్ట్ గా ఉంటూ.. సీఎం జగన్ ను ఆయన పరిపాలనను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో యాక్టివ్ గా ఉంటారన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు బాలయ్య. సాధారణంగా బాలకృష్ణ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో మాత్రం యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. కానీ ఇతర సమయంలో మాత్రం రాజకీయాల్లో కంటే సినిమాల్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పటి వరకు కూడా బాలయ్య అదే కంటిన్యూ చేశారు.

కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో.. టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే బాధ్యతను బాలకృష్ణ తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఆయన కూడా రాష్ట్రమంతా పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేకపోవడం, ముందస్తు ఎన్నికలు వచ్చినా రావొచ్చనే చర్చ జరుగుతుండటంతో బాలకృష్ణ ఇక సినిమాలకు కొన్ని నెలల పాటు ఫుల్ స్టాప్ పెట్టేందుకు దాదాపు డిసైడ్ అయ్యారనే చర్చ జరుగుతోంది.చంద్రబాబు ముందుండి నడిపించేందుకు సమయం పట్టేలా ఉండడం, ఆయన బెయిల్ పై ఎలాంటి సమాచారం లేకపోవడంతో పార్టీ దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. పార్టీని నడిపించే పూర్తి సామర్థ్యం నారా లోకేష్ లేదనే టాక్ కూడా ఉండడంతో పార్టీ బాధ్యతను తన భుజాన వేసుకున్నారు అని కొందరి టాక్.

ప్రస్తుతం బాలయ్య నటించిన భగవంత్ కేసరీ సినిమా అక్టోబర్ లో విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఎన్నికల వరకు రాజకీయాల్లోనే ఫోకస్ చేయాలని చూస్తున్నారట. ఇక టీడీపీలోని పరిస్థితులు కూడా బాలకృష్ణను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి అంటున్నారు కొందరు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version