Jawan Collections: బ్యాక్ టు బ్యాక్ బడా హిట్స్ ఇచ్చాడు హీరో షారుఖ్ ఖాన్. ఒక దశలో పరాజయాలతో డీలా పడ్డ షారుఖ్ ఖాన్ దాదాపు నాలుగేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. లేటైనా లేటెస్ట్ గా వచ్చాడు. ఆయన కమ్ బ్యాక్ మూవీ పఠాన్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది. పఠాన్ మేనియా నుండి షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ బయటకు రాకుండానే జవాన్ తో మరో బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న జవాన్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది.
మొదటి రోజు రూ. 125 వరల్డ్ వైడ్ వసూళ్లతో బాహుబలి 2 రికార్డు సైతం బ్రేక్ చేసింది. వీకెండ్ ముగిసినా జవాన్ జోరు తగ్గలేదు. వసూళ్లు ఆశాజనకంగా సాగుతుంది. 6 రోజులకు జవాన్ హిందీ వర్షన్ దాదాపు రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టింది. అత్యంత వేగంగా ఈ ఫీట్ చేరుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఇక వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి జవాన్ ఆరు రోజులకు రూ. 600 కోట్ల మార్క్ చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ లో జవాన్ కొంచెం నెమ్మదించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్, నార్త్ ఇండియాలో ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి జవాన్ మరో వంద కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. షారుఖ్ ఖాన్ నిర్మాతలకు భారీగా లాభాలు పంచారు. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రంపై అంచనాలు పెరిగాయి.
జవాన్ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించాడు. జవాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఇక అట్లీ ఇప్పటి వరకూ తెరకెక్కించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. అపజయం ఎరుగని దర్శకుడిగా రికార్డులకు ఎక్కాడు. షారుక్ కి జంటగా నయనతార నటించింది. ఆమెకు కూడా ఇది ఫస్ట్ బాలీవుడ్ మూవీ. ప్రియమణి కీలక రోల్ చేసింది. విలన్ గా విజయ్ సేతుపతి అలరించాడు. జవాన్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.