Mass Movie Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఫీల్ గుడ్ సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తారు. మరి అలాంటి దర్శకులకు మంచి టాలెంట్ ఉంటుంది. ప్రేక్షకుల్లో వల్ల సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. కానీ వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా మారాలనే ఉద్దేశ్యంతో మాస్ సినిమాలు చేయాలనుకుంటారు. కారణం ఏంటంటే ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్లకి ఉన్న ఇమేజ్ ఫీల్ గుడ్ సినిమాలు చేసే దర్శకులకు ఉండదు. అలాగని కమర్షియల్ సినిమాలను చేసే సత్తా ఫీల్ గుడ్ సినిమాలు చేసే దర్శకులకు ఉండకపోవచ్చు. దానివల్ల ఒక మంచిబ్సబ్జెక్ట్ ను మాస్ యాంగిల్ లోకి కన్వర్ట్ చేసి డైరెక్షన్ చేసే క్రమంలో ఆ సబ్జెక్ట్ చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కింగ్డమ్ సినిమా విషయంలో అదే జరిగింది. గౌతమ్ తిన్ననూరి ఫీల్ గుడ్ సినిమాలను చేయడంలో దిట్ట…ఆయనను గతం లో చేసిన మల్లిరావా, జెర్సీ లాంటి సినిమాలు మంచి విజయాలను సాధించాయి…ఇక ఇలాంటి డైరెక్టర్స్ ఇతర దర్శకులతో పోల్చుకొని వాళ్ళు కూడా మాస్ సినిమాలు చేయాలని కమర్షియల్ ఎలిమెంట్స్ ని పుష్కలంగా రంగరించి సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలపాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆ సినిమాల్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.
Also Read: రెహమాన్ మ్యూజిక్ మీద రామ్ చరణ్ అంత కాన్ఫిడెంట్ గా లేడా..?
కారణం ఏంటంటే కమర్షియల్ సబ్జెక్టుని డీల్ చేయడం అనేది అంత ఈజీ కాదు… సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కమర్షియల్ సినిమాల్లో ఏముంది నాలుగు సాంగులు, 3 ఫైట్స్ తప్ప అని అనుకుంటారు. కానీ కమర్షియల్ సినిమాని ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఏ కొంచెం తేడా కొట్టిన కూడా అందులో ఉన్న ఎమోషన్ మొత్తం కామెడీ అయిపోతుంది.
కాబట్టి పర్ఫెక్ట్ గా కమర్షియల్ సినిమాని మీటర్ మీద తీసుకెళ్లి ప్రేక్షకుడికి రీచ్ చేసినప్పుడు మాత్రమే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తాయి…అందుకే హంగులు ఆర్భాటాలకు పోకుండా దర్శకులు వాళ్ళు నమ్మిన రీతిలో వాళ్ల స్ట్రాంగ్ జోన్ ఏదైతే ఉంటుందో అందులోనే సినిమాలని చేస్తే మంచిదని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read: చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో ఆ సూపర్ హిట్ సీన్ ను రీ క్రియేట్ చేస్తున్నారా..?
మరి ఇప్పటివరకు ప్రతి ఒక్క దర్శకుడు కూడా కేజిఎఫ్, బాహుబలి లాంటి సినిమాలను చూసి అలాంటి మాదిరిగానే మనం కూడా సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగా సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా రెండు పార్టులుగా చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుల్లో కొంతవరకు అసహనం అయితే ఎదురవుతుంది. దానికి తగ్గట్టుగానే ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా డీల్ చేయలేక దర్శకులు చేతులెత్తేస్తున్నారు…