
ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రమాదకరమైన డేవిడ్ మలన్ (5) రనౌటయ్యాడు. జడేజా వేసిన 53.1 ఓవర్ కు హమీద్ (60) సింగిల్ కోసం ప్రయత్నించగా నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న మలన్ క్రీజులలోకి వెళ్లేలోపే మయాంక్ విసిరిన బంతిని అందుకొని పంత్ రనౌట్ చేశాడు. దాంతో ఇంగ్లాండ్ 120 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి కెప్టెన్ జోరూట్ వచ్చాడు. ఆ జట్టు విజయానికి ఇంకా 248 పరుగులు కావాలి.