Vishwak Sen
Vishwak Sen : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వాళ్ల సినిమాలను రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలను పిలవడమే కాకుండా వాళ్ళతో భారీగా ప్రమోషన్స్ ను కూడా చేయిస్తున్నారు. మొత్తానికైతే సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న యంగ్ హీరోలు స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తూ ఉంటారు. ఇక ఈ ‘నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi) సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్ ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్ర అయితే ఉంటుంది. ఇక దానికి మించి ఆయన సినిమా రిలీజ్ కి ముందు చాలా వివాదాలను ఎదుర్కొంటూ ఉండటం అనేది సర్వసాధారణం అయిపోయింది… ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (Ashoka Vanam lo Arjuna Kalyanam) సినిమా రిలీజ్ సమయంలో తన అభిమాని ఏదో ప్రాంక్ చేశాడని దానివల్ల జనాలు ఇబ్బందులకు గురయ్యారు అంటూ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అతనితో డిబేట్ ని ఏర్పాటు చేసి లైవ్ లోనే విశ్వక్ సేన్ ను అవమానించారు. మరి ఏది ఏమైనా కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో విశ్వక్ సేన్ కొంతవరకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మరికొన్ని సినిమాల విషయంలో కూడా ఇలాంటి తంతే జరుగుతుంది.
మరి కావాలనే విశ్వక్ సేన్ ఇలాంటి పబ్లిసిటీని కోరుకుంటున్నాడా? రీసెంట్ గా వచ్చిన లైలా(Laila) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వి మాట్లాడిన మాటలు ఒక రాజకీయ పార్టీని అవమానించే విధంగా ఉన్నాయనే ఉద్దేశ్యంతో సినిమా సమయంలో రాజకీయాలు ఏంటి అంటూ కొంతమంది ఫైర్ అయి ‘బాయికాట్ లైలా’ అనే హాష్ ట్యాగ్ ను ట్విట్టర్ మొత్తం వైరల్ చేశారు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను కూడా నెగెటివ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఈ సినిమాలో కంటెంట్ అంత పెద్దగా లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. మరి ఏది ఏమైనా కూడా విశ్వక్ సేన్ సినిమాలకు ఇలాంటి నెగెటివ్ పబ్లిసిటీ ఎందుకు వస్తుంది? తన సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి ఆయన కావాలనే కొందరితో ఇలాంటి స్టంట్ లు చేయిస్తున్నాడా లేదంటే అనుకోకుండా అలా జరిగిపోతుందా? అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక విశ్వక్ సేన్ కూడా పబ్లిక్ లో యూత్ ని ఆకట్టుకునే విధంగా మాట్లాడుతుంటాడు. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు కూడా చాలా ఓవర్ గా అనిపిస్తూ ఉంటాయి. కానీ తన అభిమానులకు మాత్రం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మీదటైనా తన వైఖరి మార్చుకోకుంటే మంచిది. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ కి ప్రమాదం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…