Madhubala
Madhubala : సినిమా ఇండస్ట్రీలో రాణించడం ఉంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటేనే వాళ్లకు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలైతే ఉంటాయి. అలా కాకుండా ఏదో ఒక సినిమాతో సక్సెస్ ని సాధించాలి అని గుడ్డిగా ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడ అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వడం చాలా కష్టమనే చెప్పాలి… సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల చాలామంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకొని ఇక్కడ సక్సెస్ అవ్వలేక ఫేడ్ అవుట్ అయిపోతున్నారు…
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది. కారణం ఏంటి అంటే హీరోలతో సమానమైన పాత్రలు వాళ్లకు రావు. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా కూడా ఒకటి అర సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందే తప్ప ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయలేరు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు అయితే ఉండదు. అందువల్ల ఆ సినిమాలు చేసిన కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టడం కష్టం అనే చెప్పాలి… కాబట్టి హీరోల పక్కన హీరోయిన్లుగా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ఇటువంటి క్రమంలోనే ఒక హీరోయిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన మార్కును చూపించింది… 1950వ సంవత్సరంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మధుబాల పలు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. చిన్నతనంలో కష్టాలను అనుభవించిన తను హీరోయిన్ గా మారి స్టార్ స్టేటస్ ని అనుభవించింది.
ఇక సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న తను అప్పట్లో కేవలం 150 రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునేది. మరి మొత్తానికైతే 10 సంవత్సరాల కాలంలో 70 సినిమాల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది.
ఇక ఆ తర్వాత 1969వ సంవత్సరంలో అనారోగ్య సమస్యల వల్ల 36 సంవత్సరాలకే మరణించింది. ఢిల్లీలో పుట్టిన ఆమె ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అంత గొప్ప గుర్తింపును సంపాదించుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. చూడడానికి చాలా అందంగా ఉండే ఆమెను చాలా మంది అభిమానులు ఆరాధించేవారు… మొత్తానికైతే ఇండియన్ సినిమా స్థాయిని పెంచడంలో అప్పటినుంచే నటి నటులు తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తూ వచ్చారు.
ఇక ఎట్టకేలకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ గా మారడానికి అప్పట్లో వాళ్ళు చేసిన సినిమాలే కారణం అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక మొత్తానికైతే అందాల నటి మధుబాల (Madhubala) చాలా చిన్న ఏజ్ లోనే మరణించడం అనేది అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిని దిగ్బ్రాంతికి గురిచేసిందనే చెప్పాలి…ఇక పుల్వారి, పూజారి, నీల్ కమల్, మేరే భగవాన్ లాంటి హిట్ సినిమాల్లో నటించింది…