Raja Saab
Raja Saab : ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తున్న ప్రభాస్(Rebel Star Prabhas), ప్రస్తుతం మారుతి(Director Maruthi) దర్శకత్వంలో ‘రాజా సాబ్'(Raja Saab Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 80 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్, ప్రభాస్ కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడంతో కొంతకాలం ఆగిపోయింది. రీసెంట్ గానే కోలుకున్న ప్రభాస్, ఇండియా కి తిరిగొచ్చి హను రాఘవపూడి మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. అనుపమ్ ఖేర్ తో కలిసి ప్రభాస్ పాల్గొన్న రీసెంట్ షెడ్యూల్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలై అవి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ‘రాజా సాబ్’ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండడం వల్ల వాయిదా వేశారు.
ప్రస్తుతం హను రాఘవపూడి(Hanu Raghavapudi) మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తి అవ్వగానే, ప్రభాస్ ‘రాజా సాబ్’ కొత్త షెడ్యూల్ కి డేట్స్ కేటాయించి పూర్తి చేసేస్తాడు. కానీ VFX టీం నుండి పనుల్లో చాలా జాప్యం జరుగుతుందట. దీంతో జులై 18 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. హారర్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి, VFX పై అత్యధికంగా ఈ చిత్రం ఆధారపడాల్సి ఉంటుంది. బెస్ట్ థియేట్రికల్ అనుభూతి కలగాలంటే, కచ్చితంగా VFX హై క్వాలిటీ తో ఉండాలి. అందుకే మూవీ టీం ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తున్నారు. అందుకే ఈ సినిమా నవంబర్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. VFX వర్క్ అనుకున్న స్థాయిలో రాకపోతే ఈ ఏడాది మొత్తం విడుదల కాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
నిర్మాత మైండ్ లో వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచన కూడా ఉందట. కామెడీ హారర్ కాబట్టి, ఆ సీజన్ లో అద్భుతంగా క్లిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటీవల కాలంలో సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాల స్టామినా ని కళ్లారా చూసిన మేకర్స్, ఆ సీజన్ ని వదులుకోకూడదు అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాళవిక మోహనన్ కి ఇదే తొలి తెలుగు సినిమా. ఇక నిధి అగర్వాల్ క్యారక్టర్ ఆడియన్స్ ని షాక్ కి గురయ్యేలా చేస్తుందట. మొదట్లో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెద్దగా లేవు. కానీ ఎప్పుడైతే ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదలైందో, అప్పటి నుండి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాని తీర్చి దిద్ధేందుకు మారుతీ తన నుండి తీ బెస్ట్ ఇస్తున్నాడని సమాచారం.