Electric Car: పెట్రోల్, డీజిల్ కార్ల హవా కొనసాగుతున్న సమయంలో ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయాలన్న ఆలోచన చేసి ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు ఆయన. ఆయన కృషి ఫలితంగానే రేవా(Reva) పుట్టుకొచ్చింది. ఈ కారు ఎలా వచ్చింది. భారత్‌లోకి ఎలక్ట్రిక్ కారు రావడానికి కారణం ఎవరు.. ఆయన చేసిన కృషి ఏంటి తెలుసుకుందాం.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా..
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ఇంధనాలతో కార్లు రోడ్లపై తిరుగుతున్న కాలంలో దూరదృష్టితో ఎలక్ట్రిక్ కారు తయారీ ప్రారంభించాడు చేతన్ మైని. పచ్చని భవిష్యత్ కోసం కలలు కంటూ ఎలక్ట్రిక్ కారు రేవాకు పునాది వేశారు. ఇదే నేడు గణనీయమైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీగా మార్గదర్శి. సవాళ్లకు భయపడకుండా.. ఆటుపోట్లకు వెరవకుండా ఇంధన వినియోగం తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షిచండమే లక్ష్యంగా చేతన్‌మైని ఎలక్ట్రిక్ వామనాలు రావాలని ఆకాంక్షించాడు. అదే ఈరోజు ప్రభుత్వం కూఏడా ఈవీల తయారీని ప్రోత్సహించేలా దోహదం చేస్తోంది.
ఎవరీ ‘చేతన్ మైని’?
1970 మార్చి 11న చేతన్ మైని(Chetan Maini) బెంగళూరులో జన్మించాడు. ఈయన తండ్రి సుదర్శన్ కె.మైని. చేతన్ 1992లో మిచిగాన్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ, 1993లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింVŠ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తర్వాత 100 శాతం ఈవీ వాహనాలపై దృష్టిపెట్టాడు. ఇందులో భారత్ కీలకంగా ఉండాలని భావించాడు. బెంగళూరులో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి నాయకత్వం వహించాడు. రెండేళ్లలో రేవా ఎలక్ట్రికక్ కారు తయారు చేశాడు. ఈ రేవా తర్వాత మహీంద్రా గ్రూప్‌తో కలిసి మహీంద్రా రేవాగా మారింది. ఈ కారు తయారీలో చేతన్ టెక్నాలజీ – స్ట్రాటజీ చీఫ్‌గా పనిచేశారు. మూడేళ్లు పనిచేసి కొత్త సాంకేతికతపై దృష్టిపెట్టారు. ఆ తర్వాత మహీంద్రా ఈ20 కార్ల తయారీ ప్రారంభించింది. ఆ సమయంలో చేతన్ కంపెనీ సీఈవోగా పదవి చేపట్టారు. కొన్నేళ్ల తర్వాత రాజీనామా చేశారు. ప్రస్తుతం సన్ మొబిలిటీని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ, ఇంధన వినియోగం తగ్గింపు లక్ష్యంగా చేతన్ మైని చేసిన గొప్ప ఆలోచన, అచంచలమైన సంకల్పంతో స్థిరమైన ఆవిష్కరణ భారత్‌ను ప్రపంచ వేదికపై నిలిపేలా చేసింది. చేతన్ మైని దూరదృష్టి అపారమైనది. ఆయన ఆలోచనలు అత్యున్నతమైన భవిష్యత్‌కు బాటలు వేశాయి.