https://oktelugu.com/

Mokshagna : కొడుకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీని పట్టించుకోని బాలయ్య, కారణం ఇదే!

నందమూరి బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞ ని భారీగా లాంచ్ చేస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.

Written By:
  • S Reddy
  • , Updated On : November 23, 2024 / 10:55 AM IST

    This is the reason why Balayya doesn't care about his son's debut movie Mokshagna!

    Follow us on

    Mokshagna : నందమూరి బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞ ని భారీగా లాంచ్ చేస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి కీలకమైన మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బాలయ్య దృష్టి పెట్టడం లేదు. అందుకు ఓ కారణం ఉంది. 
     
    ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మొదటి చిత్రంతో సత్తా చాటి, ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిస్తే.. కెరీర్ కి గట్టి పునాది పడుతుంది. స్టార్ కిడ్స్ ని తమ గాడ్ ఫాదర్స్ అందుకే గ్రాండ్ గా ప్రజెంట్ చేశారు. మంచి కథ, దర్శకుడిని ఎంచుకుని.. అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటారు. ఇక నందమూరి వారసుడు, అందులోనూ బాలకృష్ణ కుమారుడు అంటే.. మామూలుగా ఉంటుందా.. చెప్పండి. 
     
    బాలకృష్ణ మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై చాలా కసరత్తే చేశాడు. కథలు, దర్శకుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక దశలో తానే స్వయంగా దర్శకత్వం వహించి మోక్షజ్ఞను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని భావించారు. బాలయ్యకు డైరెక్షన్ లో అనుభవం లేదు. దర్శకుడిగా స్టార్ట్ చేసిన ఒకటి రెండు చిత్రాలు మధ్యలో ఆగిపోయాయి. రిస్క్ ఎందుకని ఫార్మ్ లో ఉన్న ప్రశాంత్ వర్మకు ఆ బాధ్యత అప్పగించాడు. 
     
    లవ్ ఎమోషన్స్ కలగలిపి ఓ సోషియో ఫాంటసీ సబ్జెక్టు ప్రశాంత్ వర్మ సిద్ధం చేశాడట. విజువల్ ట్రీట్ గా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మించనున్నారట. కాగా ఆ మధ్య మోక్షజ్ఞ లుక్ ఒకటి విడుదల చేశారు. అనంతరం మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. ఎప్పుడు షూటింగ్? అనేది కూడా తెలియదు. అదే సమయంలో బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ చిత్రం పై దృష్టి పెట్టలేకపోతున్నాడు. 
     
    అందుకు ఓ కారణం ఉంది. బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండగా షూటింగ్ పూర్తి చేసే పనిలో బాలయ్య ఉన్నారు. డాకు మహారాజ్ కి డబ్బింగ్ కూడా చెప్పేస్తే బాలకృష్ణ ఫ్రీ అవుతారు. అప్పుడు పూర్తి సమయం కేటాయించనున్నారట. కాగా డిసెంబర్ చివరి నుండి మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. వచ్చే ఏడాది చివర్లో విడుదలయ్యే సూచనలు కలవట. ఇక మోక్షజ్ఞకు జంటగా రవీనా టాండన్ కూతురు రషా తడని నటిస్తున్నట్లు సమాచారం. శ్రీలీల పేరు కూడా పరిశీలనలో ఉంది.