Junior NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. అందులో కొరటాల శివ ఒకరు. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అందుకోవడమే కాకుండా దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన సినిమాలు సక్సెస్ ఫుల్ గా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు.
మరి ఈ సినిమా మరొక నాలుగు రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ దేవర సినిమా హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ మీద కొంత వరకు కోపంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్ళు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నప్పటికీ వీళ్ళ మధ్య అంత సన్నిహిత సంబంధలైతే లేవు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ అనుకున్నట్టుగా సినిమా అవుట్ పుట్ రాలేదని అందువల్లే ఆయన కొరటాల మీద కొంతవరకు కోపంతో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమా తర్వాత దాదాపు మూడు సంవత్సరాల సమయాన్ని ఈ సినిమా మీద కేటాయించిన జూనియర్ ఎన్టీఆర్ సరైన ఔట్ పుట్ మాత్రం తీసుకు రాలేకపోయాడు అనేది ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో భారీగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ట్రైలర్ ని కనక మనం చూసినట్లయితే గ్రాఫిక్స్ లో పెద్దగా వైవిధ్యం అయితే ఏమీ లేదు. అది ఈజీగా గ్రాఫిక్స్ అనే విషయం మనకు తెలిసిపోతుంది. రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ చేసినా కూడా అది గ్రాఫిక్స్ అనే విషయాన్ని మనం పసిగట్టలేము. కానీ దేవర సినిమాలో మాత్రం ఈజీగా గ్రాఫిక్స్ అనేది తెలిసిపోయే విధంగా కనిపిస్తుండడంతో ఈ సినిమా మీద కొన్ని ట్రోల్స్ అయితే వస్తున్నాయి.
దానివల్ల ఎన్టీఆర్ కొరటాల శివ మీద కొంత వరకు కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ అయితేనే తప్ప లేకపోతే కొరటాలకి ఎన్టీఆర్ కి మధ్య సత్ సంబంధాలు ఉండే అవకాశాలు లేనట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో వీళ్లిద్దరు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది…