https://oktelugu.com/

Venkatesh-Balakrishna : వెంకటేష్ తో బాలయ్య.. ఇద్దరి కలయిక షేక్ చేస్తోంది.. కారణం ఇదే

ఇద్దరు స్టార్ హీరోలు ఒక చోట చేరారంటే ఆ కిక్కే వేరు. తాజాగా వెంకటేష్ మూవీ సెట్స్ లో బాలయ్య సందడి చేశాడు. ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీరిద్దరూ కలవడం వెనుక కారణం ఏమిటీ?

Written By: S Reddy, Updated On : September 22, 2024 11:45 am
Venkatesh-Balakrishna

Venkatesh-Balakrishna

Follow us on

Venkatesh-Balakrishna : టాలీవుడ్ ని దశాబ్దాల పాటు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఏలారు. ఈ నలుగురు హీరోలకు భారీ ఫ్యాన్ బేస్, మార్కెట్ ఉండేది. ఈ మధ్య వెంకీ, నాగ్ రేసులో వెనుకబడ్డారు. సోలోగా వారి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. దాంతో మల్టీస్టారర్స్ వైపు మళ్లుతున్నారు. వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి చేసిన ఎఫ్ 2, ఎఫ్ 3 మంచి విజయాలు అందుకున్నాయి. ఎఫ్ 2 అయితే 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

ప్రస్తుతం వెంకటేష్ హిట్ కాంబోలో మూవీ చేస్తున్నారు. వెంకటేష్ లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీ-అనిల్ రావిపూడి కాంబోలో ఇది మూడో చిత్రం. హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

సంక్రాంతికి వస్తున్నాం లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేస్తున్నారు. సడన్ గా అక్కడ బాలకృష్ణ ప్రత్యక్షమయ్యాడు. తమ మూవీ సెట్స్ లోకి బాలకృష్ణ రావడంతో వెంకటేష్, అనిల్ రావిపూడితో పాటు చిత్ర యూనిట్ షాక్ అయ్యారట. ఏదో పని మీద రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన బాలకృష్ణ.. వెంకటేష్ మూవీ షూటింగ్ జరుగుతుందని తెలుసుకుని అక్కడకు వెళ్ళాడట.

అనిల్ రావిపూడి, వెంకటేష్ లను ఆయన ఆప్యాయంగా పలకరించాడు. కాసేపు ఈ ముగ్గురి మధ్య సంభాషణ చోటు చేసుకుందట. సంక్రాంతికి వస్తున్నాం మూవీ చిత్ర విశేషాలు బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారట. మీడియాకు వెంకీ-బాలయ్య కలిసి ఫోజులిచ్చారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెప్పాలంటే సోషల్ మీడియా షేక్ అయ్యింది. అనిల్ రావిపూడితో బాలయ్య భగవంత్ కేసరి చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఇది హిట్ టాక్ తెచ్చుకుంది.

మరోవైపు బాలకృష్ణ NBK 109 పూర్తి చేస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కూడా సంక్రాంతికి విడుదల చేసే అవకాశం కలదు. అదే జరిగితే… బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ చాలా కాలం తర్వాత సంక్రాంతికి పోటీ పడ్డట్లు అవుతుంది. విశ్వంభర 2025 జనవరి 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇక 2001 సంక్రాంతి కానుకగా నరసింహనాయుడు, దేవీపుత్రుడు, మృగరాజు చిత్రాలు విడుదలయ్యాయి. నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దేవీపుత్రుడు యావరేజ్ గా నిలిచింది. మృగరాజు మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది.