https://oktelugu.com/

Jr NTR : ఆ స్టార్ హీరోకి పోటిగానే ఎన్టీయార్ ఈ యంగ్ హీరోలను ఎంకరేజ్ చేస్తున్నాడా..?

ఇక మొత్తానికైతే విజయ్ పేరు చెప్తే అల్లు అర్జున్, విశ్వక్ సేన్ పేరు చెప్తే జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నాడు. ఇక నిజానికి విశ్వక్ సేన్ కి, విజయ్ దేవరకొండ కి మధ్య అప్పట్లో కొన్ని విభేదాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక మొత్తానికైతే స్టార్ హీరోల అండతో యంగ్ హీరోలు కూడా వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు...

Written By:
  • NARESH
  • , Updated On : April 9, 2024 / 08:52 PM IST

    Why is NTR anchoring these young heroes?

    Follow us on

    Jr NTR : సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు పక్షపాతాలు ఉంటాయని మనకు క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం హీరో రికమండ్ చేసిన వాళ్ళని సినిమాల్లో తీసుకుంటూ ఉంటారు. అందుకే చాలామంది చిన్న చిన్న నటులు, మీడియం రేంజ్ హీరో లు పెద్ద హీరోలతో చాలా సన్నిహితంగా ఉంటారు.

    ఇక ఒకప్పుడు చిరంజీవి గ్రూప్, మోహన్ బాబు గ్రూప్ అని ఇండస్ట్రీ లో రెండు వర్గాలు ఉండేవని అప్పట్లో చాలా వార్తలైతే వచ్చేవి.. కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి ఏమీ లేవు. ఒక హీరో గాని, ఒక నటుడు గాని అద్భుతంగా నటిస్తే స్టార్ హీరోలందరూ వారిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక అందులో భాగంగానే ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న తర్వాత విజయ్ దేవరకొండ ని అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ తన ఈవెంట్లకి హాజరవుతూ వచ్చాడు.

    కానీ విజయ్ మాత్రం స్టేజ్ ఎక్కిన ప్రతిసారి కాంట్రవర్సి కలిగించే కామెంట్స్ చేయడంతో అతని మీద జనాల్లో నెగిటివిటీ ఎక్కువగా పెరిగిపోయింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం యంగ్ హీరోలుగా కొనసాగుతున్న విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. ఇక దీనికి గల కారణం ఏంటి అంటూ పలు రకాల ప్రశ్నలు కూడా వెలువడుతున్నాయి. అయితే బేబీ సినిమా వివాదం లో విశ్వక్ సేన్ చిక్కుకున్నప్పుడు ఆయన్ని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ కొన్ని కామెంట్లు కూడా చేశాడు. ఇక దానివల్లే అప్పుడు విశ్వక్ సేన్ చాలా సఫర్ అయ్యాడు. అయితే ఆ తర్వాత విశ్వక్ సేన్ ఎన్టీఆర్ ని ఆశ్రయిస్తూ ఆయన సపోర్ట్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ విజయ్ తో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. అందువల్లే ఎన్టీఆర్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా విశ్వక్ సేన్ కి సపోర్ట్ చేస్తున్నాడు.

    ఇక ఇటు అల్లు అర్జున్, అటు ఎన్టీఆర్ ఎవరికి వారు వాళ్లకు నచ్చిన యంగ్ హీరోలకి సపోర్టుగా ఉంటు వాళ్ల సర్కిల్ లో కొంతమంది హీరోలను తయారు చేసుకుంటున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక మొత్తానికైతే విజయ్ పేరు చెప్తే అల్లు అర్జున్, విశ్వక్ సేన్ పేరు చెప్తే జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నాడు. ఇక నిజానికి విశ్వక్ సేన్ కి, విజయ్ దేవరకొండ కి మధ్య అప్పట్లో కొన్ని విభేదాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక మొత్తానికైతే స్టార్ హీరోల అండతో యంగ్ హీరోలు కూడా వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు…