spot_img
Homeఎంటర్టైన్మెంట్Super Star Krishna- Naresh: మహేష్ బాబును వదిలి నరేష్ ఇంటిలోనే కృష్ణ ఎందుకు ఉన్నట్టు.....

Super Star Krishna- Naresh: మహేష్ బాబును వదిలి నరేష్ ఇంటిలోనే కృష్ణ ఎందుకు ఉన్నట్టు.. అసలు కారణం ఏంటి?

Super Star Krishna- Naresh: సూపర్ స్టార్ కృష్ణ మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీని విషాదం లోకి నెట్టింది. ఆయన చనిపోయి వారం రోజులు గడుస్తున్నా.. ఇంకా ఆయనతో గడిపిన క్షణాలు, ఇతర విషయాలు తోటి నటులు, కుటుంబ సభ్యులు చర్చించుకుంటున్నారు. ఇక కృష్ణ ఫ్యాన్స్ ఇప్పటికీ ఆయన గురించి పలు విషయాలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. కృష్ణకు మహేశ్ బాబు కంటే నరేశ్ పై ఎక్కువ ప్రేమ ఉండేదట. కృష్ణ లేరని తెలిసిన తరువాత మహేశ్ కంటే నరేష్ ఎక్కువగా బాధపడ్డాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?

Super Star Krishna- Naresh
Super Star Krishna- Naresh, mahesh babu

కృష్ణ సినీ ఇండస్ట్రీకి రాకముందు ఇందిరను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అంటే 1965 అక్టోబర్ 13 నాటికి రమేష్ వారికి జన్మించారు. వీరికి మొత్తం ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ ఈ ఏడాది జనవరి 8న మరణించాడు. చిన్న కొడుకు మహేష్ సినిమాల్లో కొనసాగుతున్నాడు. కుమార్తెల్లో పద్మజ, ప్రియదర్శిని, మంజులలు ఉన్నారు. వీరిలో మంజుల సినీ ఫీల్డులో కొనసాగుతున్నారు. పద్మిని భర్త సుధీర్ బాబు సినీ హీరో. ప్రియదర్శిని భర్త గల్లా జయదేవ్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

‘సాక్షి’ సినిమా చేసే సమయంలో కృష్ణ, విజయనిర్మల ప్రేమలో పడ్డారు. అయితే అప్పటికే విజయ నిర్మల, ఇతర వ్యక్తికి నరేష్ జన్మించాడు. విజయ నిర్మల ఆ వ్యక్తితో విడాకులు తీసుకొని నరేష్ తో పాటు కృష్ణ దగ్గరే ఉంటూ వచ్చింది. కృష్ణ సినిమాలు తగ్గినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఆయన అవసరాలను మాత్రం విజయనిర్మల దగ్గరుండి చూసకునేది. ఈ క్రమంలో నరేష్ కూడా కృష్ణకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చేవారు.

Super Star Krishna- Naresh
Super Star Krishna- Naresh

2019లో విజయనిర్మల మరణం తరువాత కృష్ణ తీవ్ర దు:ఖంలోకి వెళ్లారు. అయితే ఇదే సమయంలో నరేష్ కృష్ణ వెంటే ఉంటూ విజయనిర్మల లేని లోటును తీర్చాడు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా పిలవగానే వచ్చేవారు. అలా కృష్ణ మరణించేవరకు నరేష్ తన బాగోగులు చూసుకున్నందున కృష్ణకు నరేష్ అంటే ఎంతో అభిమానం అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కృష్ణ చివరిసారిగా గడిపిన నివాసాన్ని మహేష్ నరేష్ కే ఇచ్చినట్లు సమాచారం.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper