Sukumar : ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమ సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్ళడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాడనే చెప్పాలి…
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్…ఈయన చేసిన సినిమాలన్నీ మంచి గుర్తింపును సంపాదించుకోవడమే సినిమా చూసే ప్రేక్షకులందరిని ఒక మూడ్ లోకి తీసుకెళ్తాయి. ఇక ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాలను ఎంజాయ్ చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఏర్పడుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ను హీరోగా పెట్టి ఒక భారీ ప్రాజెక్టును చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ తో ఆయన కథ చర్చలు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ ఒక సినిమా చేయాలి. అలా చేసినప్పుడే ఆయనలోని వేరియేషన్స్ కానీ, నటనలో మెలుకువలు గానీ, డైలాగ్ డెలివరీ లో మాడ్యులేషన్స్ గాని చాలా కొత్త రీతిలో వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభాస్ కూడా మంచి కథ తీసుకొని వస్తే సుకుమార్ తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే సుకుమార్ చెప్పిన కథ కూడా తనకు బాగా నచ్చిందట.
మరి వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తారనే విషయం అయితే క్లారిటీగా తెలియదు. కానీ వీళ్ళ కాంబోలో మాత్రం ఒక సినిమా పక్కాగా రాబోతుందని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా ప్రభాస్ లాంటి నటుడు పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక పుష్ప 3 సినిమాతో కూడా సుకుమార్ భారీ రేంజ్ లో తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమవుతున్నాడు. మరి వీళ్ళ కలయికలో సినిమా వస్తే మాత్రం అది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇప్పటివరకు వీళ్ల కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు.
అయితే అప్పట్లో వీళ్ళ కాంబోలో సినిమా వస్తుంది అంటూ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు రాబోయే సినిమాతో భారీ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…