Pushpa 2: The Rule : ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్…ఈయన ప్రస్తుతం చేస్తున్న పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో తను మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటానని ఈ సినిమా ద్వారా దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్లు రాబడతానని చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. మరి అల్లు అర్జున్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి గల కారణం ఏంటి అంటే సినిమా అవుట్ పుట్ చాలా బాగా వస్తుందని దానివల్లే అల్లు అర్జున్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని సినిమా మేకర్స్ అయితే చెబుతున్నారు. నిజానికైతే ఈ సినిమాలో చాలా హైలెట్ పాయింట్స్ ఉన్నాయట. ముందుగా గంగాలమ్మ జాతర ఈ సినిమాకి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక దాంతోపాటు క్లైమాక్స్ సీన్ కూడా ఈ సినిమాకి 100% హెల్ప్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారి ఈ సినిమా క్లైమాక్స్ ని చూసిన తర్వాత ప్రేక్షకుడు సూపర్ హిట్ అనుకుంటూ బయటికి రావడం పక్కా అని ఇంతకుముందు సుకుమార్ కూడా కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు. మరి మొత్తానికైతే అల్లు అర్జున్ తను అనుకున్న సక్సెస్ ని సాధిస్తాడా?
ఈ సినిమాతో తనను తాను మరొకసారి ఐకాన్ స్టార్ గా ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక గత సంవత్సరం పుష్ప సినిమాతో ‘నేషనల్ అవార్డు’ ని అందుకున్న ఆయన ఈ సంవత్సరం కూడా ఈ పుష్ప 2 సినిమాతో మరోసారి నేషనల్ అవార్డు ను అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పుడు ఈ సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నాడు.తద్వారా వీలైతే ఇండస్ట్రీ హిట్టు కూడా కొట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. అందుకే ఈ సినిమాలో ఏ చిన్న మిస్టేక్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోమని సుకుమార్ కు చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక సుకుమార్ కూడా ఈ సినిమాను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవసరం ఉన్న సమయంలో ప్యాచ్ వర్క్ కూడా చేస్తూ సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ ఫుల్ గా నిలవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… పుష్ప 2 సినిమా మీద దర్శకుడు, హీరో ఇద్దరూ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ సినిమా సక్సెస్ అవుతుందా? ఫెయిల్యూర్ అవుతుందా? అనేది తెలియాలంటే మాత్రం డిసెంబర్ 6వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…