https://oktelugu.com/

Devara Collection: 11వ రోజు చరిత్ర తిరగరాసిన ‘దేవర’..టికెట్ రేట్స్ తగ్గిస్తే ఇంత వసూళ్లు వస్తాయా?..యావరేజ్ టాక్ ఇదేమి అరాచకం సామీ!

అక్టోబర్ 3 నుండి స్కూల్ మరియు కాలేజీ పిల్లలకు సెలవులు ఇవ్వడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చాయి. నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి దాదాపుగా 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది చిన్న విషయం కాదు, నైజాం ప్రాంతంలో ఈమధ్య వీకెండ్ తర్వాత వసూళ్లు రావడం చాలా కష్టం అయిపోయింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 / 04:14 PM IST

    Devara collections

    Follow us on

    Devara Collection: ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ఈమధ్య కాలంలో ఎన్నడూ చూడని అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పుతూ సంచలనం సృష్టిస్తుంది. మొదటి వీకెండ్ తర్వాత వసూళ్లు భారీ తగ్గిపోతున్న రోజులివి. ఎంత పెద్ద కాంబినేషన్ సినిమాకి అయినా ఇది తప్పట్లేదు. అలాంటిది ‘దేవర’ చిత్రం 10 రోజుల తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ సంచలనం సృష్టించింది. దసరా సేవలను ఇంత చక్కగా ఉపయోగించుకున్న సినిమాలు ఈమధ్య కాలం లో రాలేదు. పది రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ మామూలు స్థితికి వచ్చాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ సోమవారం (11వ రోజు) మార్నింగ్ షోస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది. ఫలితంగా 11 వ రోజు ఈ చిత్రానికి కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి.

    అక్టోబర్ 3 నుండి స్కూల్ మరియు కాలేజీ పిల్లలకు సెలవులు ఇవ్వడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చాయి. నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి దాదాపుగా 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది చిన్న విషయం కాదు, నైజాం ప్రాంతంలో ఈమధ్య వీకెండ్ తర్వాత వసూళ్లు రావడం చాలా కష్టం అయిపోయింది. కేవలం వీకెండ్స్ మాత్రమే మంచి వసూళ్లు వచ్చేవి. కానీ ‘దేవర’ చిత్రానికి ప్రతీ రోజు వీకెండ్ లో వచ్చిన వసూళ్లే వస్తున్నాయి. ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా దసరా తర్వాత కూడా మంచి రన్ ఉండేలాగా అనిపిస్తుంది. అదే కనుక జరిగితే ఎన్టీఆర్ కెరీర్ లోనే ‘దేవర’ బెస్ట్ లాంగ్ రన్ వచ్చిన సినిమాగా నిలిచిపోతుంది.

    ఇంతకు ముందు ట్రేడ్ లో ఎన్టీఆర్ కి కేవలం ఓపెనింగ్స్ మాత్రమే వస్తాయి, లాంగ్ రన్ వచ్చేది కాదని అందరూ అనేవారు. కానీ ‘దేవర’ చిత్రం తో ఎన్టీఆర్ అలాంటోళ్లకు గట్టి సమాధానమే ఇచ్చాడు. దీంతో 11 రోజులకు గాను ఈ చిత్రం 164 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు జీఎస్టీ తో కలిపి వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం 6 మిలియన్ డాలర్ మార్కుని అందుకోబోతుంది. #RRR , బాహుబలి సిరీస్ కాకుండా ఇప్పటి వరకు కేవలం సలార్, కల్కి మరియు ‘దేవర’ చిత్రాలు మాత్రమే ఈ మార్కుని అందుకొన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నిన్నటి కంటే నేడు ఈ చిత్రానికి అనేక ప్రాంతాలలో మార్నింగ్ షోస్ నుండే ఎక్కువ ఆక్యుపెన్సీలు రావడం ట్రేడ్ కి కూడా అంతుచిక్కడం లేదు. సాధారణంగా మంగళవారం రోజు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు తక్కువ వస్తాయి అనేది ట్రేడ్ లో ఉండే ఒక వాదన. కానీ ‘దేవర’ ఆ వాదనలకు అతీతంగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. దసరా సెలవల్లో ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత ‘దేవర’ కే మంచి లాంగ్ వచ్చిందట.