Aadipurush : రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. జూన్ 16న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం రాముడిగా నటించారు. ఈ అవకాశం రావడం అదృష్టంగా ఆయన భావిస్తున్నారు. తిరుపతి వేదికగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మంచి స్పందన లభించింది. ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ సైతం విడుదల చేయగా గొప్ప రెస్పాన్స్ దక్కించుకుంది. ఆదిపురుష్ పై భారీ హైప్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ ఆదిపురుష్ రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది.
ఆదిపురుష్ టీజర్ విడుదల నాటి నుండి అనేక వివాదాలు, విమర్శలు వెల్లువెత్తాయి. అవి ఇంకా కొనసాగుతున్నాయి కూడాను. రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్స్ పై చిత్ర ప్రముఖులు, హిందూవాదులు అభ్యంతరం తెలియజేస్తున్నారు. ఇటీవల నటి కస్తూరి ప్రభాస్ లో రాముడు కనిపించడం లేదన్నారు. రాముడికి మీసాలు ఏమిటీ? గతంలో చాలా మంది హీరోలు రాముడు పాత్ర చేశారు. కానీ ప్రభాస్ రాముడిలా లేడు, కర్ణుడు పాత్రను తలపిస్తున్నారని ఆమె అన్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వివాదాలే ఉన్నాయి. కాగా ఆదిపురుష్ చిత్ర యూనిట్ రావణాసురుడుని దాచేస్తున్నారు. ట్రైలర్స్, ప్రోమోలలో లంకేశ్వరుడు పాత్రను చూపించడం లేదు. చూపించినా ఒకటి రెండు షాట్స్ కి పరిమితం చేశారు. లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ పాత్రను ఆదిపురుష్ యూనిట్ కావాలనే దాస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. ఆయన గెటప్ గత చిత్రాలకు, రామాయణంలో వర్ణించిన దానికి భిన్నంగా రూపొందించిన నేపథ్యంలో విమర్శలు రావచ్చని భయపడుతున్నారట. వ్యతిరేక ఉద్యమాలు తలెత్తే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్ దాచేస్తున్నారని టాలీవుడ్ టాక్.
రేపు థియేటర్స్ లో అయినా చూపించాల్సిందే. వచ్చే వివాదం అప్పుడైనా వస్తుంది. టీజర్లో లంకేశ్వరుడిగా సైఫ్ ని చూపించారు. ఆ లుక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. రావణాసురుడు శివ భక్తుడు, ఆయనకంటూ ఓ రూపం ఉంది. మీకు ఇష్టం వచ్చినట్లు ఎలా చూపిస్తారని కొందరు ఓం రౌత్ మీద మండిపడ్డారు. సాంప్రదాయ రావణాసురుడు గెటప్ కి భిన్నంగా ఏదో హాలీవుడ్ చిత్ర విలన్ మాదిరి ప్రజెంట్ చేశారు. విమర్శల తర్వాత ఆదిపురుష్ చిత్ర విడుదల ఆరు నెలలు వాయిదా వేసి మెరుగులుదిద్దారు. ఈ క్రమంలో రావణాసురుడు గెటప్ మార్చారేమో చూడాలి.