Vijay Devarakonda Vs Anasuya : ఇటీవల అనసూయ విజయ్ దేవరకొండతో వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. విజయ్ దేవరకొండకు నాపై ద్వేషం ఉందో లేదో నాకు తెలియదు. ఒకప్పుడు మేము మంచి మిత్రులం. ఆయన నిర్మించిన మీకు మాత్రమే చెప్తా మూవీలో నాకు మంచి పాత్ర కూడా ఇచ్చాడు. అయితే విజయ్ దేవరకొండ వద్ద పని చేసే వ్యక్తి డబ్బులిచ్చి నన్ను ట్రోల్ చేయిస్తున్నాడని తెలిసి నేను చాలా బాధపడ్డాను. విజయ్ దేవరకొండకు తెలియకుండా ఆ వ్యక్తి నన్ను టార్గెట్ చేశాడని నేను అనుకోవడం లేదు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ వివాదాన్ని నేను పొడిగించాలని అనుకోవడం లేదని అనసూయ చెప్పుకొచ్చారు.
ఈ విషయంపై మరోసారి ఆమె స్పందించారు. విమానం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న అనసూయను రిపోర్టర్… విజయ్ దేవరకొండతో గొడవలకు స్వస్తి పలికాను, పొడిగించను అని చెప్పారు. అపరాధ భావంతో ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక మనశ్శాంతి కోసమా? అని అడగ్గా… ఖచ్చితంగా మనశ్శాంతి కోసమే అని అనసూయ అన్నారు. ఆమె విజయ్ దేవరకొండను టార్గెట్ చేయడం వెనుక కారణాలు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

డబ్బులిచ్చి నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారని, ట్రోల్స్ కి పాల్పడుతున్నారని తెలిసి నేను చాలా ఫీల్ అయ్యాను. ఆ సంఘటన తెలిశాక విజయ్ దేవరకొండ మీద పగ పెంచుకున్నాను. నాకు తెలియకుండా సందర్భం దొరికినప్పుడుల్లా విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా స్పందించాను. నేను ఒక అమ్మాయిని, తల్లిని అది మీకు తెలుసు. అలాంటి నన్ను బాధపెట్టారు. జీవితంలో ప్రతి ఒక్కరూ మెప్పు కోరుకుంటారు. నేను కూడా అంతే. నేను ఫిల్టర్లు లేకుండా మాట్లాడతాను. ఏది ఏమైనా ఇకపై వివాదం కొనసాగించకూడదు అనుకుంటున్నాను, అని అనసూయ అన్నారు.
మీరు ఒకసారి ఫోన్ చేసి విజయ్ దేవరకొండతో మాట్లాడితే సరిపోయేది కదా… అని అడగ్గా, నేను ట్రై చేశాను కుదర్లేదు. నాకు పిఆర్లు లేరు. నా గురించి నేనే మాట్లాడుకుంటాను, అని అనసూయ చెప్పుకొచ్చారు. తనపై ఉద్దేశపూర్వకంగా ట్రోల్స్ కి పాల్పడుతున్నారని తెలిసి, అది చేయిస్తుంది విజయ్ దేవరకొండనే అని అనసూయ పగ పెంచుకున్నారట. అందుకే ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారట. లైగర్ ప్లాప్ కావడాన్ని ఎంజాయ్ చేస్తూ ట్వీట్ చేసిన అనసూయ, ఖుషి పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరును తప్పుబట్టారు.