https://oktelugu.com/

Akshay Kumar: అక్షయ్ కుమార్ కు భారీ హిట్లను ఇచ్చిన డైరెక్టర్లు మరో స్టార్ హీరోకి ఎందుకు ప్లాప్ లను ఇస్తున్నారు…

స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు వరుసగా సూపర్ సక్సెస్ లు అవుతుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ బాలీవుడ్ లో ఇప్పుడు దానికి వ్యతిరేకం గా జరుగుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 9, 2024 / 07:24 PM IST

    Akshay Kumar

    Follow us on

    Akshay Kumar: బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరు ఇప్పుడు అంత సక్సెస్ ఫుల్ హీరోలుగా మాత్రం ముందుకు సాగడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ఇప్పుడు ఎవరిని అలరించకపోగా భారీ డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే ఒకప్పుడు సూపర్ సక్సెస్ లను అందించిన అక్షయ్ కుమార్ సైతం వరుసగా 13 డిజాస్టర్ లను ఇవ్వడం అనేది నిజంగా బాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది…ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు అక్షయ్ కుమార్ భారీ సక్సెస్ లను చవి చూశాడు. ఇక అందులో భాగంగానే ఆయనతో సూపర్ హిట్లను అందించిన స్టార్ డైరెక్టర్లు సైతం ఇప్పుడు మరొక సీనియర్ హీరో అయిన అజయ్ దేవగన్ కి ప్లాప్ లను కట్టబెడుతున్నారు… రీసెంట్ గా అజయ్ దేవగన్ హీరోగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఔరోన్ మే జగన్ దమ్ థా’ మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఇంతకుముందు అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సెల్ఫీ, మిషన్ రాణిగంజ్ లాంటి సినిమాలు చెత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ అజయ్ దేవగన్ సినిమా మరొక చెత్త రికార్డుని క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా బాడ్ న్యూస్ అనే చెప్పాలి.

    ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు అక్షయ్ కుమార్ కి సూపర్ సక్సెస్ లను అందించిన దర్శకులందరూ అజయ్ దేవగన్ కి వరుసగా ఫ్లాప్ లను అందిస్తున్నారు. అక్షయ్ కుమార్ కి హేరా ఫేరీ, భూల్ భూలయ్య లాంటి మంచి హిట్ సినిమాలు అందించిన ప్రియదర్శన్ అజయ్ దేవగన్ తో చేసిన ఆక్రోష్ సినిమా డిజాస్టర్ అయింది… ఇక అక్షయ్ కుమార్ సాజిద్ ఖాన్ డైరెక్షన్ లో చేసిన హౌస్ ఫుల్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆయన అజయ్ దేవగన్ తో ‘హిమ్మత్ వాలా’ అనే సినిమా చేశాడు అది ప్లాప్ అయింది… అలాగే ప్రభుదేవా డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ చేసిన ‘రౌడీ రాథోడ్’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక ప్రభుదేవా అజయ్ దేవగన్ తో చేసిన యాక్షన్ జాక్సన్ మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది…ఇక ఇప్పుడు నీరజ్ పాండే డైరెక్షన్ లో చేసిన బేబి, స్పెషల్ 26 సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వగా, ఆయన అజయ్ దేవగన్ తో చేసిన ఔరోన్ మే కాహన్ దామ్ థా భారీ డిజాస్టర్ అయింది…

    ఇలా ఒక హీరోకి సూపర్ సక్సెస్ అందించిన దర్శకులు మరొక హీరోకి ప్లాప్ సినిమాలను ఇవ్వడంతో అజయ్ దేవగన్ అభిమానులు చాలా వరకు నిరుత్సాహపడుతున్నారు. ఇక ప్రస్తుతానికి బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏం బాగాలేదు. అయినప్పటికీ ఈ హీరోలు చేసిన సినిమాలు సైతం డిజాస్టర్లుగా మిగిలుతుంటే ఇప్పుడు ఏం చేయాలి అనేది ఎవరికి అర్థం కావడం లేదు…

    నిజానికి ఒకప్పుడు స్టార్ హీరోలైన ఖాన్ త్రయం తో పోటీ పడుతూ అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోలు మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు ఆ మ్యాజిక్ ఏది రిపీట్ కావడం లేదు. ఖాన్ త్రయం తో పాటు వీళ్ళు చేసిన సినిమాలు కూడా ప్లాప్ అవుతుండడంతో బాలీవుడ్ జనాలు సౌత్ సినిమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు…