https://oktelugu.com/

Modi Govt : అనుమతి దశలోనే విస్తృత చర్చ వెనుక మోడీ ప్రభుత్వం ఆంతర్యం ఏంటి?

అనుమతి దశలోనే విస్తృత చర్చ వెనుక మోడీ ప్రభుత్వం ఆంతర్యం ఏంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 9, 2024 / 08:00 PM IST

    Modi Govt : వక్ఫ్ బిల్లు చర్చ అందరూ ఊహించనిది జరిగింది. అందరూ ఏం అనుకున్నారు. మోడీ అనుకున్నది నెరవేరుతుందని భావించారు. లోక్ సభలో బిల్లు పాస్ అవుతుందని అనుకున్నారు. కానీ పాస్ కాలేదు. పాస్ కాకుండా జేపీసీకి రిఫర్ చేశారు.

    పార్లమెంట్ లో అసలు జరిగింది ఏంటంటే.. మోడీ ఈ బిల్లు తీసుకొచ్చే ముందే ప్రభుత్వం ద్వారా మీడియాకు లీకులు ఇప్పించారు. ఇందులో 40 సవరణలు ఉండబోతున్నాయని.. బిల్లు రాకముందే చర్చకు పెట్టారు.

    ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, రైతు చట్టాలు అయినా సడెన్ గా మోడీ పార్లమెంట్ కు తీసుకొచ్చాడు. బిల్లు రాకముందే టీవీల్లో చర్చకు పెట్టాడు. ప్రతిపక్షాల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేయకపోతే నష్టపోతామని గ్రహించి చర్చకు పెట్టారు.

    బిల్లు అనుమతిరోజే విస్తృత చర్చకు పార్లమెంట్ లో పెట్టారు. ప్రతీ ప్రతిపక్ష సభ్యుడికి.. ఇండిపెండెంట్లకు అవకాశం ఇచ్చారు. తర్వాత దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విపులంగా .. ప్రతి ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అరటిపండు వలచి పెట్టినట్టుగా వివరించాడు. కాంగ్రెస్ చేసిన నిర్వాకంను బయటపెట్టాడు. దేశం ఎందుకు బిల్లు తెచ్చింది.. బిల్లు ఎందుకు తెచ్చారన్నది బయటపెట్టాడు.

    అనుమతి దశలోనే విస్తృత చర్చ వెనుక మోడీ ప్రభుత్వం ఆంతర్యం ఏంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.