Chiranjeevi : చిరంజీవి ఎంటైర్ కెరియర్ లో ఈ ఒక్క పాత్ర ఎందుకు చేయలేదు..?

ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి తొందర్లోనే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది...

Written By: S Reddy, Updated On : June 3, 2024 8:39 pm

Chiranjeevi

Follow us on

Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మూస ధోరణి సినిమాలు నడుస్తున్న సమయంలో తన రాక తో ఇండస్ట్రీలో ఒక అలజడి సృష్టించిన ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి… తన డ్యాన్స్ లు, పైట్ల తో హీరో అంటే ఇలా ఉండాలి అనేలా హీరో అనే పదానికే గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి కూడా చిరంజీవే కావడం విశేషం… ఇక దానివల్లే చిరంజీవికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు దక్కుతున్నాయి. ఒక సినిమా కోసం ఆయన చిన్న పిల్లాడిలా ఏది చెబితే అది చేస్తూ సినిమా మీద పూర్తి ఎఫర్ట్ ను పెట్టి సక్సెస్ సాధించాలని చూస్తాడు.

ఇక తన ఎంటైర్ కెరియర్ లో ఆయనకు సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక ఇప్పటికి కూడా ఆయన హీరోగా చేస్తూ మంచి గుర్తింపు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఇపుడున్న యంగ్ హీరోలకి సైతం పోటీని ఇస్తున్నాడు. ఇక చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో అన్ని రకాల పాత్రలని పోషించాడు. కానీ సూపర్ మ్యాన్ అవతారం లో మాత్రం ఆయన ఇంతవరకు ఎప్పుడు కూడా మనకు కనిపించలేదు.

చిరంజీవి ని ఆ పాత్రలో చూడడానికి అప్పట్లో ప్రేక్షకులు ఉర్రుతలుగారు. కానీ ఆయన దగ్గరికి అలాంటి స్క్రిప్టు లు రాకపోవడం వల్లే తను అలాంటి పాత్రను చేయలేకపోయానని చిరంజీవి కూడా చాలాసార్లు చెప్పారు. ఇక ఆయన ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేశాడు. కాబట్టి దాంట్లో హీరోకి ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉంటాయో అలాంటి క్వాలిటీస్ తోనే మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కలగలిపి ఆయన సినిమాలు వచ్చేవి.

ఆయన స్టార్ డమ్ ముందు అప్పట్లో సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్క హీరో కూడా నిలబడలేదు అంటే 90 స్ లో చిరంజీవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు… ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి తొందర్లోనే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది…