https://oktelugu.com/

Kalki 2898 AD : కల్కి’లో బుజ్జి కాపీనా… ప్రభాస్ పెదనాన్న సినిమా నుండే లేపేసిన నాగ్ అశ్విన్!

కల్కి సినిమాలో ప్రభాస్ కూడా తన ఫ్రెండ్ బుజ్జిని ట్రీట్ చేయడంతో చెయ్యెత్తి జైకొట్టు సినిమా నుండి నాగ్ అశ్విన్ బుజ్జి పాత్రను కాపీ చేశాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2024 / 09:21 PM IST

    Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD – Bujji : ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. కల్కి చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, దుల్కర్ సల్మాన్, రానా వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.

    కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ. ఈ పాత్రకు ప్రాణ స్నేహితుడిగా బుజ్జి అనే ఓ బుల్లి మెషిన్ ఉన్న సంగతి తెలిసిందే. బుజ్జి పాత్ర సినిమాలో ఎంత ముఖ్యమైందో అర్ధమయ్యేలా చిత్ర యూనిట్ ఇటీవల ఓ ఈవెంట్ ద్వారా పరిచయం చేసింది. బుజ్జి – ప్రభాస్ కి మధ్య బంధాన్ని హైలెట్ చేస్తూ ప్రైమ్ వీడియోలో ఓ యానిమేటెడ్ ఎపిసోడ్ కూడా విడుదల చేశారు. కల్కి చిత్ర గ్లిమ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

    ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో రూపొందించిన బుజ్జి పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. కాగా ఈ బుజ్జి పాత్రకు హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఇవ్వడం విశేషం. ఇక రీసెంట్ గా బుజ్జి, భైరవ కెమిస్ట్రీ ని తెలిపే ప్రమోషనల్ కంటెంట్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఇందులో భైరవ బుజ్జిని తన బుజాలపై పెట్టుకున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇలా బుజ్జిని భైరవ భుజాలపై పెట్టుకోవడాన్ని నాగ్ అశ్విన్ కాపీ కొట్టారనే విషయాన్ని నెటిజన్లు కనిపెట్టారు.

    ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ‘చెయ్యెత్తి జైకొట్టు’ అనే సినిమాలో రుద్రయ్య అనే పెంపుడు పావురం ఆయనకు మిత్రుడుగా ఉంటుంది. ఆ పావురం భుజంపై ఉన్నంతసేపు కృష్ణం రాజు చాలా ప్రశాంతంగా ఉంటాడు. కానీ ఫైట్ సీన్స్ లో మాత్రం రుద్రయ్యను దూరంగా ఉంచుతాడు. అదే తరహాలో కల్కి సినిమాలో ప్రభాస్ కూడా తన ఫ్రెండ్ బుజ్జిని ట్రీట్ చేయడంతో చెయ్యెత్తి జైకొట్టు సినిమా నుండి నాగ్ అశ్విన్ బుజ్జి పాత్రను కాపీ చేశాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది వాస్తవం కాదనే వాదన వినిపిస్తోంది. అది కేవలం యాదృశ్చికం అంటున్నారు.