Homeఎంటర్టైన్మెంట్Jagapathi Babu : నాగార్జున అన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు... రహస్యం బయటపెట్టిన జగపతిబాబు!

Jagapathi Babu : నాగార్జున అన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు… రహస్యం బయటపెట్టిన జగపతిబాబు!

Jagapathi Babu : టాలీవుడ్లో అత్యంత ఆస్తిపరుల్లో అక్కినేని నాగార్జున ఒకరు. ఆయన స్థిర చర ఆస్తుల విలువ కొన్ని వేల కోట్లు అని సమాచారం. నాగార్జున కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు. ఎక్కువగా సంపద రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో పలు చిత్రాలు నిర్మించాడు.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కింగ్ నాగార్జున ఆస్తుల విలువ దాదాపు రూ. 3010 కోట్లు. అయితే నాగార్జున ఇంత ఆస్తి ఎలా సంపాదించారో ఆయన బెస్ట్ ఫ్రెండ్ బయటపెట్టాడు. ఆయన కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. కాగా నాగార్జున బెస్ట్ మరెవరో కాదు సీనియర్ నటుడు జగపతిబాబు. నాగార్జున, జగపతిబాబు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అట. ఓ సందర్భంలో నాగార్జున డబ్బులు సంపాదించడం పై జగపతిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

జగపతిబాబు మాట్లాడుతూ .. నాగార్జున, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తరచుగా ఫ్యామిలీ పార్టీల్లో కలుసుకునేవాళ్ళం. నాగార్జునను నేను ఒక నిక్ నేమ్ తో పిలిచేవాడిని. ఆయన్ని చౌ అని పిలుస్తాను. నాగార్జునని అలా పిలిచేది నేనొక్కడినే. అతను కూడా తిరిగి నన్ను చౌ అని పిలుస్తాడు. రెండు రోజులకు ఒకసారైనా నాగార్జునని తలచుకుంటాను. ఎందుకంటే అతనికి డబ్బు ఎలా సంపాదించాలో బాగా తెలుసు.

దానిని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలుసు. నాగార్జున ఏదైనా వ్యాపారం కానీ, పని కానీ మొదలు పెడితే అందులో స్వయంగా ఇన్వాల్వ్ అవుతాడు. వేరే వాళ్ళకి అప్పగించి తాను రిలాక్స్ అవ్వడు. చాలా ఇంటెలిజెంట్. విషయం ఏదైనా ప్రాక్టికల్ గా ఆలోచిస్తాడు. అదే నాగార్జున సక్సస్ సీక్రెట్ అని జగపతిబాబు చెప్పుకొచ్చారు. మరోవైపు జగపతి బాబు వ్యసనపరుడు. ఒక దశలో జూదంలో ఉన్నదంతా పోగొట్టుకున్నానని ఆయన స్వయంగా చెప్పాడు. లెజెండ్ వరకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న జగపతిబాబు… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి నిలదొక్కుకున్నాడు.

Exit mobile version