https://oktelugu.com/

Anushka Shetty: పవన్ కళ్యాణ్ తో అనుష్క ఎందుకు చేయలేదు, ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా చేసింది.. అన్నీ కుదిరితే ఆ రెండు సినిమాల్లో జంటగా

పవన్ కళ్యాణ్-అనుష్క శెట్టి కాంబోలో ఒక్క చిత్రం కూడా రాలేదు. అయితే వీరిద్దరూ కలిసి రెండు చిత్రాలు చేయాల్సింది. అవి ఎలా మిస్ అయ్యాయి. ఒక సినిమాను అనుష్క రిజెక్ట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ కథేమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : March 16, 2025 / 09:19 AM IST
    Anushka Shetty (1)

    Anushka Shetty (1)

    Follow us on

    Anushka Shetty: అనుష్క శెట్టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆమె డౌన్ టు ఎర్త్ కలిగిన హీరోయిన్. స్టార్డం పెరిగినా, భారీ హిట్స్ కొట్టినా విపరీతంగా రెమ్యూనరేషన్ పెంచేది కాదట. అందుకే నిర్మాతలు అనుష్కతో చిత్రాలు చేసేందుకు ఇష్టపడేవారు. చెప్పాలంటే అనుష్క వివాదరహితురాలు. సాఫ్ట్ అండ్ స్వీట్ యాటిట్యూడ్ కలిగి ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా చాలా స్వీట్ పెర్సనాలిటీ కలిగి హీరో. మితంగా మాట్లాడతారు. సెట్లో తన పని తాను చూసుకుని, ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుకుంటాడు.

    Also Read: నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తా, దమ్ముంటే రారా… పబ్లిక్ లో రెచ్చిపోయిన అనసూయ, రాయలేని భాషలో సైగలు!

    కాగా అనుష్క శెట్టి- పవన్ కళ్యాణ్ కాంబోలో ఒక్క చిత్రం కూడా రాలేదు. టాప్ స్టార్స్ అందరితో జతకట్టిన అనుష్క పవర్ స్టార్ తో ఎందుకు మూవీ చేయలేదనే సందేహం ఉంది. కాగా… అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. వారి కాంబో ఎందుకు సెట్ కాలేదో చూద్దాం. బంగారం మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించాల్సింది అట. ఈ మూవీలో మీరా చోప్రా, రీమా సేన్ హీరోయిన్స్ గా నటించారు. చివర్లో త్రిష చిన్న గెస్ట్ రోల్ చేసింది.

    ఈ పాత్రకు అనుష్కను అనుకున్నారట. గెస్ట్ రోల్ కావడంతో అనుష్క సున్నితంగా తిరస్కరించారట. అలాంటి రోల్ తన కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె భావించి చేయను అన్నారట. అప్పట్లో ఈ మేటర్ మీడియాలో రావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకింత అనుష్క మీద ఫైర్ అయ్యారు. ఇక వీరి కాంబోలో మిస్ అయిన రెండో చిత్రం విక్రమార్కుడు. దర్శకుడు రాజమౌళి ఈ కథను పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నారు. కానీ సెట్ కాలేదు. అప్పుడు రవితేజ వద్దకు వెళ్ళింది. హీరోయిన్ గా అనుష్క నటించింది.

    ఒకవేళ విక్రమార్కుడు మూవీ పవన్ కళ్యాణ్ చేసి ఉంటే అనుష్క జతకట్టేది. ఈ కారణంగా పవన్ కళ్యాణ్-అనుష్క శెట్టి నటించాల్సిన చిత్రాలు మిస్ అయ్యాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. అనుష్క కమర్షియల్ చిత్రాలు చేయడం ఆపేసింది. కాబట్టి భవిష్యత్తులో వీరు కలిసి మూవీ చేస్తారని చెప్పలేం.