Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. ఆమెతో పెట్టుకుంటే అంతే సంగతులు. అనసూయ పై నెగిటివిటీ ఎక్కువ. తరచుగా ఆమెను ట్రోల్ చేస్తుంటారు. ఆంటీ అంటే అనసూయకు అసలు నచ్చదు. కొంత వరకు విమర్శలు తీసుకుంటుంది. శృతి మించితే సైబర్ కేసులు పెడుతుంది. సాధారణంగా సెలెబ్స్ ముక్కు ముఖం తెలియని వారు సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ ని పట్టించుకోరు. కానీ అనసూయ ఆ టైప్ కాదు. రియాక్ట్ అవుతుంది. ఘాటైన రిప్లై ఇస్తుంది. కొన్నాళ్ళు అనసూయకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో వివాదం నడిచింది.
Also Read: రెడ్ డ్రెస్ లో పూజ హెగ్డే గ్లామర్ ట్రీట్… ఆ సౌందర్యం చూసి కళ్ళు తిప్పుకోవడం కష్టమే!
విజయ్ దేవరకొండను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసిన అనసూయ సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది. ఉదాహరణకు… విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ది’ పెడుతూ అప్పటి మూవీ పోస్టర్ విడుదల చేశారు. ది(The) పెట్టడాన్ని ఆమె ఎద్దేవా చేసింది. అది నచ్చని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కావాలనే విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేశానని అనసూయ అనంతరం ఒప్పుకుంది. అందుకు కారణం కూడా ఆమె చెప్పింది.
అనసూయ డ్రెస్సింగ్, ఫెమినిస్ట్ ని అంటూ ఆమె చేసే కామెంట్స్ సైతం ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి. తరచుగా ఆమె వివాదాల్లో ఉంటుంది. ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ కలిగి ఉండే అనసూయ తాజాగా ఓ కుర్రాడికి లైవ్ లో వార్నింగ్ ఇచ్చింది. హోలీ సందర్భంగా అనసూయ ఓ ఈవెంట్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఒకరు అనసూయను ట్రోల్ చేశాడు. అది గమనించిన అనసూయ మైక్ లో.. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా.. దమ్ముంటే స్టేజ్ మీదకు రా, అని అన్నారు.
ఉ** పడుతున్నాయా, అటు వెళ్లి పోసుకో.. అని అర్థం వచ్చేలా వేళ్ళతో సైగ చేసి చూపింది. అనసూయ మాస్ వార్నింగ్ ఇచ్చిన తీరుకు అక్కడ ఉన్న కుర్రాళ్లంతా వెర్రెత్తిపోయారు. కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
మరోవైపు నటిగా అనసూయ ఫుల్ బిజీ. క్రేజీ ఆఫర్స్ ఆమె తలుపు తడుతున్నాయి. అలాగే బుల్లితెరపై కూడా అనసూయ అలరించనుంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 త్వరలో స్టార్ట్ కానుంది. ఇటీవల ప్రోమో విడుదల చేశారు. శేఖర్ మాస్టర్ తో పటు ఆమె జడ్జిగా వ్యవహరించనుంది.