https://oktelugu.com/

Rajinikanth: అజిత్ చేయాల్సిన ఆ సూపర్ హిట్ సినిమాను రజినీకాంత్ ఎందుకు చేశాడు…

సినిమా అంటే ప్రాణంగా ప్రేమిస్తూ సినిమానే దైవంగా భావిస్తూ మూవీస్ చేస్తు ఇండస్ట్రీలో సక్సెస్ లను అందుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. విపరీతమైన కష్టాలు పడి సినిమా చేయాలని ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఇక్కడ స్టార్ హీరోలుగా ఎదిగిన వాళ్ళు సైతం చాలా మంది ఉన్నారు. నిజానికి తెలుగులో చిరంజీవి అంతటి గొప్ప ఘన కీర్తిని సాధిస్తే తమిళంలో రజనీకాంత్ కూడా సోలోగా ఇండస్ట్రీకి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 18, 2024 / 12:13 PM IST

    Rajinikanth(5)

    Follow us on

    Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా 40 సంవత్సరాల నుంచి వెలుగొందుతున్న ఏకైక హీరో రజనీకాంత్…తనదైన రీతిలో సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నాడు. మరి ఆయన లాంటి హీరోతో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం రజినీకాంత్ తో శివాజీ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాని మొదట శంకర్ అజిత్ తో చేయాలని అనుకున్నాడట. ఇక ఆయనకి కథ కూడా వినిపించినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. మరి అజిత్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

    అయినప్పటికి శంకర్ ఈ సినిమా స్క్రిప్ట్ రజనీకాంత్ తో చేయాలనే ఉద్దేశ్యంతో అజిత్ తో ఈ సినిమాని కాన్సల్ చేసుకొని రజనీకాంత్ దగ్గరికి వెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించిందో మనం అర్థం చేసుకోవచ్చు. తమిళ్, తెలుగు రెండు భాషల్లో కూడా ఈ సినిమా భారీ సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునేలా చేసింది.

    నిజానికి అజిత్ తో చేస్తే తమిళ్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది తెలుగులో వర్కౌట్ అవ్వదనే ఉద్దేశ్యం తోనే శంకర్ రజనీకాంత్ తో ఈ సినిమా చేశాడు అంటు అప్పట్లో కోలీవుడ్ మీడియాలో చాలా కథనాలైతే వెలుపడ్డాయి. మరి మొత్తానికైతే శంకర్ చేసిన ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా అటు రజనీకాంత్ కెరియర్ లో కూడా సూపర్ సక్సెస్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా కూడా శివాజీ సినిమా నిలవడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి…

    ఇక రజనీకాంత్ శంకర్ కాంబినేషన్ లో ఐ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ల కాంబోలో మరొక సినిమా రావడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక వీళ్ళ కాంబినేషన్ వచ్చిన రోబో సినిమా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా కూడా ఎలివేట్ చేసుకున్నారు. మొత్తానికైతే పాన్ ఇండియాలో రోబో సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి అప్పట్లో శంకర్ స్టామినా ఏంటో ఇండియా మొత్తానికి తెలిసేలా చేసింది…