Bucchi Babu Vs Srikant Odela Competition: సినిమా ఇండస్ట్రీలో దర్శకుల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఒక సినిమాతో ఒక డైరెక్టర్ సూపర్ సక్సెస్ ని సాధించి టాప్ పొజిషన్ కి వెళ్తే మరి కొంతమంది దర్శకులు వాళ్లకి పోటీని ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఎవరైతే సక్సెస్ లను సాధిస్తారో వాళ్లకి ఇక్కడ ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అలాగే ప్రేక్షకుల్లో ఎక్కువగా మ్యాజిక్ ని ఇంజెక్ట్ చేయగలిగితే మాత్రం ఆ దర్శకులకు ఇండస్ట్రీలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉంటాయి…ఇక ప్రస్తుతం ఇద్దరు దర్శకుల మధ్య విపరీతమైన పోటీ ఉంది. ‘ఉప్పెన’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్నాడు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!
ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది… అలాగే దసర సినిమాతో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానికి సైతం మాస్ ఇమేజ్ ని కట్టబెట్టాడు…
ప్రస్తుతం నానితో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ చేసింది. అలాగే రీసెంట్ గా వచ్చిన ఆయా షేర్ సాంగ్ సైతం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల టాప్ డైరెక్టర్ గా మారతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఈ ఇద్దరు దర్శకులలో ప్రేక్షకుల్లో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే శ్రీకాంత్ ఓదెలకి ఎక్కువ క్రేజ్ ఉందని చెబుతున్నారు. ప్యారడైజ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తన మేకింగ్ స్టైల్ కూడా చాలా కొత్తగా ఉండడంతో శ్రీకాంత్ వైపే ప్రతి ఒక్కరు మొగ్గు చూపిస్తున్నారు. ఇండస్ట్రీ లో ఆయన టాప్ పొజిషన్ కి వెళ్తాడు అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…