Rajamouli- Brahmastra: మహానుభావులు ఊరికే ఏదీ చేయరంటారు. రాజమౌళి బ్రహ్మాస్త్రం చిత్రాన్ని భుజాన వేసుకొని మోస్తుండగా ఆయన ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారో అర్థం కావడం లేదు. అయితే దాని వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది బ్రహ్మాస్త్రం. దాదాపు రూ. 400 కోట్లకు పైగా బుడ్జెట్ తో కరణ్ జోహార్ నిర్మించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. బ్రహ్మాస్త్రం విజయం సాధించడం బాలీవుడ్ కి చాలా అవసరం. ఈ సినిమా కూడా నిరాశ పరిస్తే పరిశ్రమ మరింత అగాధంలోకి జారుకోవడం ఖాయం.

హిందీతో పాటు సౌత్ ఇండియాలో భారీగా సక్సెస్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. దీని కోసం రాజమౌళి సహాయం తీసుకున్నారు. బ్రహ్మాస్త్రం ప్రమోషన్స్ రాజమౌళి అన్నీ తానై నిర్వహిస్తున్నాడు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి శతవిధాలా కృషి చేస్తున్నాడు. ఎన్టీఆర్ గెస్ట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమౌళి ఏర్పాటు చేశాడు. అనుకోని కారణాలతో అది క్యాన్సిల్ అయ్యింది. చేసేది లేక ఎన్టీఆర్ ని పిలిచి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఇక బ్రహ్మాస్త్రం హీరో హీరోయిన్స్ రన్బీర్ కపూర్, అలియా భట్ బిగ్ బాస్ 6 గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అలాగే సుమ క్యాష్ షోకి కూడా రావడం జరిగింది. ఇవన్నీ రాజమౌళి ఆలోచలని సమాచారం. సినిమా ప్రమోషన్స్ నిర్వహించడంలో, హైప్ తేవడంలో రాజమౌళికి మించినవాడు లేడు. ఆయన్ని పెద్ద మార్కెటింగ్ జీనియస్ గా అభివర్ణించవచ్చు. ఆ విషయం అటుంచితే రాజమౌళి బ్రహ్మాస్త్రం ప్రమోషన్స్ సీరియస్ గా తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందట. బ్రహ్మాస్త్రం తెలుగు రాష్ట్రాల్లో రాజమౌళి స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు సమాచారం.

బ్రహ్మాస్త్రం కంటెంట్ పై నమ్మకం ఉన్న రాజమౌళి తన మిత్రుడు బళ్లారి సాయితో కలిసి ఈ భారీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారట. ఈ క్రమంలో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పాటు చేసి విజయం అందుకోవాలనేది ఆయన పక్కా ప్లాన్ అట. బాలీవుడ్ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం మార్కెట్ లేదు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి హీరోల చిత్రాలు కూడా ఆదరణ దక్కించుకోవడం లేదు. అందుకే రాజమౌళి బ్రహాస్త్రం సక్సెస్ ని సీరియస్ గా తీసుకున్నారట. మరి రాజమౌళి ప్రయత్నాలు ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాలి. ప్రాధమికంగా బుకింగ్స్ బాగానే ఉన్నట్లు సమాచారం. బ్రహ్మాస్త్రం మూవీలో నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ నటిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read:Samantha: కలిసి రాకున్నా అదే పని చేస్తానుంటున్న సమంత… అందరిలాంటి అమ్మాయి కాదుగా!