Nagarjuna And Venkatesh: ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన వెంకటేష్ వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ పేరుని, మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. లవ్ స్టోరీస్ ని కూడా ఎక్కువగా చేస్తూ వచ్చాడు. అయితే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ గా వచ్చిన నువ్వు వస్తావని సినిమాని మొదటగా డైరెక్టర్ వి ఆర్ ప్రతాప్ వెంకటేష్ కి చెప్పాడు. వెంకటేష్ కూడా సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.
కానీ అప్పుడు వెంకటేష్ కలిసుందాం రా సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూట్ కి లేట్ అయింది. అయిన కూడా ఈ సినిమా అయిపోయాక మనం నీ సినిమా చేద్దామని చెప్పాడు. దానికి వి ఆర్ ప్రతాప్ కూడా ఓకే అనడంతో ఆ స్క్రిప్ట్ ని వెంకటేష్ లాక్ చేసి పెట్టుకున్నాడు. మధ్యలో ప్రొడ్యూసర్ అయిన ఆర్.బి చౌదరి ఒకరోజు నాగార్జున ని క్యాజువల్ గా కలిసినప్పుడు ఈ స్టోరీ గురించి చెప్పడంతో నాగార్జున సినిమా మనం చేద్దామని చెప్పి ఈ సినిమాని చాలా తొందరగా షూటింగ్ స్టార్ట్ చేశారు.
ఇక విషయం తెలుసుకున్న వెంకటేష్ డైరెక్టర్ వి అర్ ప్రతాప్ తో మనం చేద్దాం అనుకున్నాం కదా అని అడిగితే ప్రొడ్యూసర్ ఆర్ బి చౌదరి నాగార్జునతో చేయమని ఆ కాంభినేషన్ సెట్ చేశారు సార్ అని చెప్పాడు. ఇక దాంతో వెంకటేష్ కూడా చేసేదేం లేక ఆ సినిమాని లైట్ తీసుకున్నాడు ఇక అదే టైమ్ లో వెంకటేష్ ఎన్ శంకర్ డైరెక్షన్ లో చేసిన సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమా సక్సెస్ అవ్వడమే కాకుండా వెంకటేష్ కి హీరో గా మరొక మెట్టు పైకెక్కించిందనే చెప్పాలి.
ఇలా వెంకటేష్ చేయాల్సిన సినిమా నాగార్జున చేసినప్పటికీ వెంకటేష్ దానిని యాక్సెప్ట్ చేసి తన పనుల్లో తను బిజీగా ఉన్నాడు అంతే తప్ప వెంకటేష్ డైరెక్టర్ ని గాని, ప్రొడ్యూసర్ ని గాని ఎంత మాత్రం తప్పు పట్టలేదు. ఇప్పటికి వెంకటేష్ ఇండస్ట్రీలో ఎవరితో గొడవలు పెట్టుకోకుండా కామ్ గా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అందుకే నీకు ఇండస్ట్రీలో మంచి పేరు అయితే ఉంది ఇక ఇప్పుడూ ఆయన యాక్షన్, కామెడీ అంటూ అన్ని రకాల సినిమాలు చేస్తూ వస్తున్నారు…