Mahesh Babu- Namrata Shirodkar: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకం. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈయన దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగానే కొనసాగుతున్నాడు. తండ్రి కృష్ణ వారసత్వంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. తనకంటూ సొంత ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. నాట నుంచి నేటి వరకు అందమైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన నేటి కుర్ర హీరోలకు విపరీతమైన పోటీ ఇస్తున్నారు. 2023 ఆగస్టు 9న 48వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ గురించి అనేక పర్సనల్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా మహేష్-నమ్రతలు ప్రేమ వివాహాన్ని చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి ప్రేమను ముందుగా కృష్ణ ఒప్పుకోలేదట. అందుకు కారణం ఏంటంటే?
మహేష్ ఘట్టమనేని 1975 ఆగస్టు 9న కృష్ణ-ఇందిర దంపతులకు జన్మించారు. మహేష్ 4 ఏళ్ల వయసు ఉండగానే దాసరినారాయణరావు తీసిన ‘నీడ’ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన మహేష్ తండ్రి కృష్ణ, అన్న రమేష్ లతో కలిసి పలు సినిమాల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్టుగానే మహేష్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులపాటు చదువుపై శ్రద్ధ పెట్టిన మహేష్ 1999లో కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఫస్ట్ మూవీనే సక్సెస్ కావడంతో మహేష్ అందరికీ పరిచయం అయ్యాడు. ఆ తరువాత వంశీ, యువరాజు అనే సినిమాలో నటించారు. వంశీ సినిమాలో నమ్రతా శిరోద్కర్ హీరోయిన్ గా నటించారు. 2000 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలో నమ్రతాతో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఐదేళ్ల పాటు వీరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను మహేష్ ఇంట్లో చెప్పారు. కానీ కృష్ణ ఒప్పుకోలేదు. అయినా వీరు 2005 ఫిబ్రవరి 10న వీరు పెళ్లిచేసుకున్నారు.
వాస్తవానికి కృష్ణ ఓ తెలుగు అమ్మాయిని ఇచ్చి మహేష్ కు పెళ్లి చేయాలని అనుకున్నాడు. కానీ మహేష్ అప్పటికే నమ్రతాతో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ తరువాత మహేష్ తల్లి ఈ విషయంపై కృష్ణకు సర్ది చెప్పడంతో ఆ తరువాత ఒప్పుకున్నారు. దీంతో మహేష్ దంపతులు కృష్ణ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక వీరులవ్ చేసుకున్నప్పటి నుంచి మహేష్ అక్క మంజుల వీరికి సపోర్టుగా ఉండేది. దగ్గరుండి మరీ వీరి పెళ్లి చేయించిందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.