Devara Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్…ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని మూటగట్టుకుంది అనే విషయాల మీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మొదటి నుంచి కూడా చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి భారీ ఓపిన్నింగ్స్ కూడా దక్కాయి. మరి ఇలాంటి క్రమంలో సినిమాకి కొంతవరకు డివైడ్ టాక్ అయితే వస్తుంది. ఇక ఇలాంటి టాక్ రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అనేదాని మీదనే ఇటు ప్రేక్షకుల్లో కానీ, అటు విమర్శకుల్లో కాని ఒకటే కారణం చెప్తున్నారు. అది ఏంటి అంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఒకే అనిపించేలా ఉన్నప్పటికి, సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడ తేడా కొట్టిందని వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం సినిమాకి భారీ మైనస్ అయిందంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక చివరిలో ఇచ్చిన ట్విస్ట్ కి కూడా ప్రేక్షకులను అంత పెద్దగా సాటిస్ఫై చేసే విధంగా లేదని, దానివల్లే ఈ సినిమాకి మైనస్ అయిందని కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక ఇప్పటికే వరుసగా 6 సక్సెస్ లతో మంచి జోష్ మీదున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు అంటే వరుసగా 7 సక్సెస్ లను అందుకున్న హీరోగా గుర్తింపు పొందుతాడు. ఇక ప్రస్తుతానికి అయితే సగం మంది సినిమా బాగుందని చెప్తున్నారు.
కొంతమంది సినిమా నచ్చలేదని చెప్తున్నారు. ఇంకొక నాలుగు రోజులు గడిస్తే తప్ప ఈ సినిమా రిజల్ట్ ఏంటి అనేదాని మీద ఎలాంటి ఒపీనియన్ ని ఫైనల్ చేయడానికి వీల్లేదు…నిజానికి కొరటాల శివ సినిమా మొత్తాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించినప్పటికి సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ సినిమాకి భారీ మైనస్ ని మిగిల్చడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమానిని కూడా కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి.
నిజానికి కొరటాల శివ కొంచెం బాగా కథ రాసుకొని ఉంటే బాగుండేది. ఇక దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ మాత్రం చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. కానీ కథలో ఇంకాస్త దమ్ముంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటే భారీ రేంజ్ లో ఉండేవి. జూనియర్ ఎన్టీయార్ ను ఇప్పటికే మ్యాన్ ఆఫ్ ది మాసెస్ గా పిలుస్తూ ఉంటారు. కాబట్టి సినిమా కథ క్లారిటీగా ఉంది ఉంటే సినిమా ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసేది…