https://oktelugu.com/

Tollywood Movies : ఈ ఇయర్ ప్రభాస్, ఎన్టీయార్ వచ్చేశారు… ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ లు రావాల్సి ఉందా..?

ఒక సినిమాతో సక్సెస్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా ఓపిక ఉండాలి. అలాగే హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ఇవేవీ లేకపోయిన సినిమాను సక్సెస్ చేయడం చాలా కష్టం అవుతుంది...

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2024 / 10:02 PM IST
    Follow us on

    Tollywood Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీ లోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా దూసుకుపోతున్న విషయం మనకు తెలిసిందే. మన ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తమదైన రీతిలో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే ప్రభాస్ కల్కి సినిమాతో భారీ వచ్చి రికార్డ్ లను క్రియేట్ చేసిన ప్రభాస్ ప్రభంజనం ముగిసిన తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం దేవర సినిమాతో ఎన్టీయార్ పంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎంతవరకు కలెక్షన్లని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటికే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయంటూ అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికే ప్రభాస్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు వాళ్ల సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో రామ్ చరణ్ అల్లు అర్జున్ లకు భారీ గుర్తింపు రావాల్సి ఉంది.

    ఇక ఈ సంవత్సరం చివరి నెలలో వీళ్ళిద్దరూ ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. పుష్ప 2 డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకులు ముందుకు వస్తుంటే, గేమ్ చేంజర్ సినిమా మాత్రం డిసెంబర్ 20వ తేదీన థియేటర్ లోకి రానుంది. మరి ఈ సినిమాలతో వాళ్ళు ఎలాంటి రికార్డను క్రియేట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే పుష్ప సినిమాతో 350 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టారు. ఇక ఇప్పుడు పుష్ప 2 తో 1500 కోట్ల కలెక్షన్స్ ను సంపాదించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు.

    మరి అంత భారీ కలెక్షన్స్ రావాలంటే సినిమాలో మ్యాటర్ అయితే ఉండాలి. మరి ఈ సినిమాలో మంచి మ్యాటర్ ఉందని సుకుమార్ మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందనేది తెలుసుకోవడానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…

    అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక అలాగే గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ కూడా సూపర్ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక రీసెంట్ గా శంకర్ ‘భారతీయుడు 2’ సినిమాతో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్నప్పటికి గేమ్ చేంజర్ సినిమా విషయంలో మాత్రం రామ్ చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక భారీ సక్సెస్ అందుకుని తనకున్న గ్లోబల్ స్టార్ అనే పేరును ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలని చూస్తున్నాడు…