Junior NTR : ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టార్ గా ఏ స్థాయిలో ఉన్నాడో మన అందరికీ తెలిసిందే. నిన్న విడుదలైన ‘దేవర’ చిత్రం ఓపెనింగ్ వసూళ్లను చూసి ఆయన స్థాయి అందరికీ మరోసారి గుర్తు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతున్న ‘దేవర’ సంగతి కాసేపు పక్కన పెడితే, ఎన్టీఆర్ తన అభిమానులను, సన్నిహితులను, స్నేహితులను ఎంత ప్రేమిస్తాడో మన అందరికీ తెలిసిందే. అతను మాట్లాడుతున్నంతసేపు మన తోటి స్నేహితుడు మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది, ఒక్క పెద్ద సూపర్ స్టార్ అనే ఫీలింగ్ అసలు రాదు. అది ఆయన సింప్లిసిటీ కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ కి ఒక్క పవన్ కళ్యాణ్ మినహా స్టార్ హీరోలందరూ మంచి స్నేహితులే.
కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎన్టీఆర్ కి మంచి సన్నిహితులు. వారిలో రాజీవ్ కనకాల ఒకడు. మొదటి నుండి ఈయన ఎన్టీఆర్ కి ప్రాణ స్నేహితుడుగా అందరికీ తెలుసు. ఏ సమస్య వచ్చినా ఎన్టీఆర్ రాజీవ్ కోసం అండగా నిలబడతాడు. ఒక సందర్భం గురించి వివరిస్తూ ఇటీవలే రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఒక రోజు ఆంధ్రవాలా మూవీ షూటింగ్ జరుగుతూ ఉంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఎన్టీఆర్ ని రమ్మని పిలిచాడు. అక్కడ అందరూ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఎన్టీఆర్ అక్కడికి వెళ్తూ నన్ను కూడా రమ్మని పిలిచాడు. నేను వద్దులేరా, ముందు నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను, నీతో పాటు నేను అక్కడికి వస్తే వాళ్ళు ఏమంటారో!, అసలు అందరూ పెద్ద ఆర్టిస్టులు అని నేను అన్నాను. నిన్ను ఎవరు ఏమి అనరు, నువ్వు నాతో రా అని అక్కడికి తీసుకెళ్లాడు. నేను ఊహించినట్టు గానే ఒక సీనియర్ ఆర్టిస్టు నేను రాగానే ‘ఏమయ్యా..నీకు బుద్దుందా?, ఇంతమంది పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వు కూడా వస్తావా?, మేము ఎంత సీనియర్స్ అనేది తెలుసా నీకు?’ అని అన్నాడు. ఆ సీనియర్ ఆర్టిస్టు పేరు ఇప్పుడు అవసరం లేదులే, ఈ మాటలు వినగానే ఎన్టీఆర్ కల్పించుకొని ‘ఎవరు సార్ సీనియర్?, అసలు సీనియారిటీ అంటే ఏమిటి?, రాజీవ్ ఎన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లో ఉన్నాడో మీకు తెలుసా?, అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటో మీకు తెలుసా?, అయిన రాజీవ్ నేను పిలిస్తేనే వచ్చాడు. అతనిని అవమానిస్తే నన్ను అవమానించినట్టే, దయచేసి క్షమాపణలు చెప్పండి’ అని అన్నాడు. అప్పుడు ఆ సీనియర్ ఆర్టిస్ట్ సారీ బాబు, ఏమి అనుకోకు అని క్షమాపణలు చెప్పాడు’ అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. ఇంతకు ఎవరు ఆ సీనియర్ ఆర్టిస్ట్?, 20 ఏళ్ళ వయస్సు కూడా లేని ఎన్టీఆర్ చేత అన్ని మాటలు అనిపించుకున్న ఆ బుర్ర లేని ఆర్టిస్ట్ ఎవరు అనేది తెలియలేదు.